Mahesh Babu : చిన్నారి క్యూట్ సాంగ్స్‌కి ఫిదా.. మహేష్ బాబు కామెంట్.. దెబ్బకి రాత్రికి రాత్రి ఫాలోవర్స్, లైక్స్..
ఈ రీల్ మహేష్ వరకు చేరడంతో మహేష్ ఆ చిన్నారి పాటకి ఫిదా అయి..(Mahesh Babu)
- Saketh U
- Published on- November 25, 2026 / 11:50 AM IST
Mahesh Babu
Mahesh Babu : అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలువురు పోస్టులకు సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా చిన్నారులు చేసే సరదా,క్యూట్ రీల్స్ కి సెలబ్రిటీలు సైతం మురిసిపోయి రిప్లైస్ ఇస్తూ ఉంటారు. దీంతో ఆ రీల్స్, చిన్నారులు రాత్రికి రాత్రి వైరల్ అయిపోతారు. అలా తాజాగా మహేష్ బాబు ఓ చిన్నారి రీల్ కి స్పందించాడు.
bysweetlycurious అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ మహిళ తన రెండేళ్ల కూతురుతో కలిసి క్యూట్ రీల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆ చిన్ని పాప మహేష్ బాబు పోకిరి సినిమాలో నొప్పి నొప్పి గుండెంత నొప్పి, గుంటూరు కారంలో టైటిల్ సాంగ్ ని క్యూట్ గా పాడింది. ఈ రీల్ మహేష్ వరకు చేరడంతో మహేష్ ఆ చిన్నారి పాటకి ఫిదా అయి హహ… సో క్యూట్.. ఈ చిన్నారికి బోల్డంత ప్రేమ అని లవ్ సింబల్స్ తో కామెంట్స్ చేసారు.
Also Read : Kajal Aggarwal : చెల్లితో కలిసి దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. ఫొటోలు..
ఇంకేముంది మహేష్ బాబు కామెంట్ చేయడంతో ఆ రీల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. రాత్రికి రాత్రి ఆ రీల్ కి ఏకంగా 1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఆ అకౌంట్ కి ఫాలోవర్స్ పెరిగారు. మొత్తానికి మహేష్ బాబు ని మెప్పించిన చిన్నారి రాత్రికి రాత్రి స్టార్ అయిపొయింది. మీరు కూడా ఈ రీల్ చూసేయండి..
