Hanuman : ఇదెక్కడి ట్విస్ట్.. వివాదం కాస్త రెండు సినిమాలుగా.. మెగా మేనల్లుడితో హనుమాన్ 2.. జై హనుమాన్ సంగతేంటి?

సడెన్ గా ప్రైమ్ షో నిర్మాతలు హనుమాన్ 2 అని కొత్త సినిమా ప్రకటించారు. (Hanuman)

  • Updated on- November 21, 2026 / 11:25 AM IST

Hanuman

Hanuman : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజయి దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది హనుమాన్. అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ అనౌన్స్ చేసారు. అయితే హనుమాన్ రిలీజ్ తర్వాత నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మకు డబ్బుల విషయంలో విబేధాలు వచ్చాయి. నిర్మాతలు డైరెక్ట్ గానే ప్రశాంత్ వర్మపై ఆరోపణలు చేసారు.

ఆ వివాదంతో ఇద్దరూ సపరేట్ అయ్యారు. దీంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని మైత్రి నిర్మాతలతో కన్నడ హీరో రిషబ్ శెట్టితో ప్రకటించాడు. ఆ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ప్రైమ్ షో నిర్మాతలు వదిలేశారేమో అనుకున్నారు అంతా. జై హనుమాన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ సడెన్ గా ప్రైమ్ షో నిర్మాతలు హనుమాన్ 2 అని కొత్త సినిమా ప్రకటించారు.

Also Read : Shivathmika : ఈ నగరానికి ఏమైంది 2 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన శివాత్మిక..

దర్శకుడు VI ఆనంద్ తో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2 అని ప్రకటిస్తూ తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే మొదటి సినిమా ఎండింగ్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుందని తెలుస్తుంది. తేజ సజ్జ స్థానంలో వైష్ణవ్ తేజ్ నటించనున్నాడు. తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ ఎప్పట్నుంచో క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో తేజ ప్రశాంత్ వైపే నిలబడ్డాడు అని తెలుస్తుంది.

ప్రశాంత్ వర్మ – ప్రైమ్ షో నిర్మాతల వివాదం వల్ల ఇప్పుడు హనుమాన్ సినిమాకు రెండు సీక్వెల్ సినిమాలు వేర్వేరు దర్శకులు, నిర్మాతలతో ప్రకటించడం గమనార్హం. మరి ఈ వివాదం సద్దుమణుగుతుందా? లేక హనుమాన్ 2 అనౌన్స్ చేసారు కాబట్టి ఇంకా వివాదం పెద్దదవుతుందా చూడాలి. దీనిపై తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ స్పందిస్తారా చూడాలి. మరోవైపు జై హనుమాన్ షూటింగ్ జరుగుతుంది.