GV Prakash Kumar : ఫుల్ కాన్ఫిడెన్స్.. వరుస సినిమాలు.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఫుల్ పోటీ ఇస్తున్న జీవి ప్రకాష్..
హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న జీవీ ప్రకాశ్ త్వరలో 2027 సంక్రాంతికి జనవరి 12 విడుదల సినిమాతో హవా కంటిన్యూ చేస్తానంటున్నారు. (GV Prakash Kumar)
- Saketh U
- Published on- November 28, 2026 / 11:23 AM IST
GV Prakash Kumar
GV Prakash Kumar : టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నారు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్. ఈ ఇయర్ మొత్తం 4 తెలుగు సినిమాలకి సంగీతం అందించగా ఆల్మోస్ట్ అన్నీ కూడా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్సే. శ్రీనివాస మంగాపురం బాక్సాఫీస్ రిజల్ట్ తేడా కొట్టినా సాంగ్స్ బాగానే ఉన్నాయి. మాస్ మహారాజ రవితేజ ఇరుముడి, సూర్య హీరోగా వచ్చిన విశ్వనాథ్ & సన్స్‌తో సత్తా చాటారు. ఇక రీసెంట్ రిలీజ్ ఆకాశంలో ఒక తార సక్సెస్‌తో హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్న జీవీ ప్రకాశ్ త్వరలో 2027 సంక్రాంతికి జనవరి 12 విడుదల సినిమాతో హవా కంటిన్యూ చేస్తానంటున్నారు.
ఆకాశంలో ఒక తార సినిమాకు తనకు నేషనల్ అవార్డు కూడా వస్తుందని జీవి ప్రకాష్ చెప్పినట్టు ఆ సినిమా దర్శకుడు పవన్ తెలిపాడు. తాజాగా అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల సినిమాపై కూడా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్ వేసాడు జీవి ప్రకాష్.
Also Read : Vrushakarma : వామ్మో.. వృషకర్మ కోసం 4 ఎకరాల్లో భారీగా.. చైతూ కామెంట్స్.. సినిమాపై మరిన్ని అంచనాలు..
విక్టరీ వెంకటేశ్-కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ నుంచి ఇటీవల విడుదలైన డివికి డివికి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జీవీ ప్రకాశ్ అందించిన క్యాచీ ట్యూన్ ప్రజెంట్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ లిరికల్ సాంగ్ 32 మిలియన్‌కిపైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో సెకండ్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతుంది. ఇలా టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతూ క్రేజీ హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుంటోన్న జీవీ ప్రకాశ్‌కి మరో బంపర్ ఆఫర్ దక్కినట్లుగా ఇంట్రస్టింగ్ న్యూస్ వైరలవుతోంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ-డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కే NBK112 ప్రస్టేజియస్ ప్రాజెక్ట్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కన్ఫర్మ్ అయ్యినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారాట కొరటాల శివ. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పేరు కూడా వినిపించింది. అయితే మేకర్స్ జీవీ ప్రకాశ్వైపే ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య-కొరటాల మూవీ ఆఫర్ నిజమైతే.. ఇప్పటికే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్ ఆ తర్వాత టఫ్ కాంపిటీటర్ అవ్వడం మాత్రం పక్కా.
