Ananya Sharma : లవ్ బ్రేకప్ గురించి చెప్పిన అనన్య.. ఇప్పుడు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..
తన లవ్ బ్రేకప్ గురించి, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో క్వాలిటీస్ గురించి తెలిపింది. (Ananya Sharma)
Ananya Sharma
Ananya Sharma : 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న అనన్య శర్మ తర్వాత పలు సిరీస్ లు చేసి మెప్పించింది. అనన్య శర్మ మెయిన్ లీడ్ లో నటించిన హై సినిమా నవంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ బ్రేకప్ గురించి, తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో క్వాలిటీస్ గురించి తెలిపింది.
అనన్య శర్మ తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. కాలేజీలో లవ్ బ్రేకప్ అయింది. అది తెలియని వయసులో. అతను మళ్ళీ కనిపిస్తే హ్యాపీనే. నాకు అతనిపై ఒక ఎఫెక్షన్ ఉంది. అతన్ని మళ్ళీ కలిసినా ఓకే. కానీ అతను నా లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఒక రీజన్ వల్ల విడిపోయాం. లైఫ్ లో మేము ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాము. అయినా అతను మళ్ళీ వచ్చి అడగడు అని తెలిపింది.
ఇక తనకు కాబోయే వాడిలో ఉండే క్వాలిటీస్ గురించి చెప్తూ.. చాలా దయ ఉండాలి. జంతువులు అంటే ఇష్టం ఉండాలి. సహనం ఉండాలి. లైఫ్ లో క్లారిటీ ఉండాలి. తను జాబ్ చేయను ఇంట్లో ఉంటాను అన్నా పర్లేదు కానీ లైఫ్ లో ఒక క్లారిటీ ఉండాలి ఏం చేయాలి అని. లుక్స్ అనేవి టెంపరరీ. ఓ పదేళ్ల తర్వాత ఆ లుక్స్ పోతాయి. నాకంటే కొంచెం హైట్ ఉంటే చాలు అని తెలిపింది.
