India A vs Pakistan A : అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండిఉంటే.. మ్యాచ్ మరోలా ఉండేది.. పాక్‌పై ఓటమి తరువాత తిలక్ వర్మ కీలక కామెంట్స్..
India A vs Pakistan A : పాకిస్థాన్ -ఎ జట్టుపై ఓటమి తరువాత భారత్ -ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు
Tilak Varma
India A vs Pakistan A : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఎ వర్సెస్ పాకిస్థాన్-ఎ జట్ల మధ్య జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో టీమిండియాకు నిరాశ ఎదురైంది. ఆదివారం దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్-ఎ జట్టు భారత్-ఎపై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : IND vs PAK : భారత్‌కు బిగ్ షాకిచ్చిన పాక్.. తిలక్ వర్మ సెంచరీ వృథా.. చివరిలో దెబ్బతీసిన అలీ రజా
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఎ జట్టు 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ -ఎ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అభిషేక్ శర్మ (70), తిలక్ వర్మ (100), షాబాజ్ (56) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ బాటపట్టారు. దీంతో 49.1 ఓవర్లలో 265 పరుగులకు భారత్-ఎ జట్టు ఆలౌట్ అయింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ ఓటమిపై కీలక కామెంట్స్ చేశాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు అద్భుతం. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ నాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అది మాకు ఎంతో ఉపయోగపడింది. అయితే మేము వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో షాబాజ్ ఔటయ్యాడు. అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే.. నేను మ్యాచ్‌ను ముగించగలిగేవాడిని అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
పిచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో తొలి పది ఓవర్ల పాటు బంతి కొంత స్వింగ్ అయింది. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. అదే సమయంలో మేము మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అలా జరగకుండా ఉంటే 47వ లేదా 48వ ఓవర్లోనే మ్యాచ్‌ను ముగించి ఉండేవాళ్లమని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
నా దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన అంటే మ్యాచ్ గెలవడమే. మ్యాచ్ గెలవకపోతే అది నాకు అత్యుత్తమ ప్రదర్శన కానే కాదు. అయితే మ్యాచ్‌ను వీలైనంత ఎక్కువ సేపు తీసుకెళ్లాలని ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఈరోజు కూడా అదే చేశాను. మరో బ్యాటర్ ఎవరైనా నాకు సహకరించి ఉంటే మ్యాచ్‌ను కచ్చితంగా ముగించగలిగేవాడిని. జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ బాధ్యతను భుజాలపై వేసుకోవాలి. అలా బాధ్యత తీసుకోవడం నాకు నిజంగా ఇష్టం. చివరికి దేవుడి దయ వల్లే నేను ఈ పరుగులు చేయగలిగాను అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
