EPFO New Update 2026 : ఇక పీఎఫ్ డబ్బుల కోసం నో వెయిటింగ్.. UPIతోనే నేరుగా డబ్బులు తీసుకోవచ్చు!

EPFO New Update: ఈపీఎఫ్ఓ కొత్త అప్‌డేట్ ప్రకారం.. పీఎఫ్ డబ్బులను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి పొందే సదుపాయం త్వరలో రానుంది. 2026 డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు, భీమ్ యాప్ వినియోగం, విత్‌డ్రాయల్ లిమిట్స్ వివరాలేంటో చూద్దాం..

EPFO New Update 2026

  • ఉద్యోగులకు భారీ ఊరట.. ఫోన్‌లోనే పీఎఫ్ డబ్బులు పొందే ఛాన్స్
  • పీఎఫ్ విత్‌డ్రాలో కొత్త మార్పులు.. డిసెంబర్‌లోనే కొత్త సదుపాయం?
  • భీమ్ యాప్‌తో పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చా? కొత్త రూల్స్ ఇవే

EPFO New Update 2026 : పీఎఫ్ డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ (PF) అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ డబ్బులు అవసరమైతే విత్‌డ్రా చేసుకునేందుకు క్లెయిమ్ పెట్టుకోవాలి.

ఆ తర్వాత డబ్బులు ఖాతాలో జమ అయ్యే వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. అయితే, ఇకపై ఈ ఇబ్బందులకు చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు మరింత ఈజీగా పీఎఫ్ సేవలు అందించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది..

యూపీఐతో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా :
తాజా రిపోర్టుల ప్రకారం.. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలోకి పొందే సదుపాయం రానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే.. క్లెయిమ్ ఆమోదం పొందిన తర్వాత డబ్బుల కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. భీమ్ యాప్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు.

Read Also : December 2026 Bank Holidays : డిసెంబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

డిసెంబర్ ఆఖరులోగా ప్రారంభం? :
ఈ కొత్త సదుపాయాన్ని 2026 డిసెంబర్ ఆఖరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ఈపీఎఫ్ఓ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రారంభంలో కనీస లావాదేవీ పరిమితిగా రూ.1,000ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.. గరిష్ఠంగా ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

ఆలస్యానికి కారణమేంటి? :
ఈ సదుపాయం అమలులోకి రావడంలో సాంకేతిక పనులు కీలకంగా మారాయి. యూపీఐ వ్యవస్థతో ఇంటిగ్రేషన్, ఏపీఐ అభివృద్ధి, బ్యాంకింగ్ వ్యవస్థలతో టెస్టింగ్ వంటి పనులు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మొత్తానికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. పీఎఫ్ ఖాతాదారులకు డబ్బుల విత్ డ్రా మరింత ఈజీ కానుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా ప్రతిపాదిత సదుపాయమే. అధికారిక మార్గదర్శకాలు, ప్రారంభ తేదీ వెల్లడయ్యే వరకు వేచి చూడాల్సిందే..