Sabarimala Pilgrims : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే అలర్ట్.. రైళ్లలో ఈ పనులు చేస్తే చిక్కులే!

Sabarimala Pilgrims : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ కీలక సూచనలు చేసింది. రైళ్లలో కర్పూరం, అగరబత్తులు, దీపాలు వెలిగించడంపై ఆంక్షలు విధించింది. ఇరుముడి, పూజా సామగ్రి తీసుకెళ్లేవారు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Sabarimala Ayyappa Pilgrims

  • శబరిమల యాత్రికులకు రైల్వే షాక్..
  • అయ్యప్ప స్వాములారా జర భద్రం..
  • ట్రైన్‌లో కర్పూరం వెలిగిస్తే చర్యలు తప్పవు

Sabarimala Pilgrims : శబరిమల వెళ్లేందుకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వాములకు రైల్వే శాఖ కీలక సూచనలు చేస్తోంది. ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం కేరళకు వెళ్తుంటారు. చాలామంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. అయితే, ప్రయాణంలో భక్తి పేరుతో చేసే కొన్ని పనులు మాత్రం ఇబ్బందులకు దారితీయొచ్చు. ముఖ్యంగా రైళ్లలో పూజలు చేసే విషయంలో భక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. అది ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రైలులో కర్పూరం వెలిగించొద్దు :
అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పూజలు చేయడం అలవాటు. ఈ సమయంలో కర్పూర హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం, దీపాలు పెట్టడం సాధారణమే.

అయితే, రైలు బోగీల్లో మాత్రం ఇలాంటి పనులకు అనుమతి ఉండదు. కర్పూరం, అగరబత్తులు, కొవ్వొత్తులు, నూనె దీపాలు వెలిగించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే, రైలులో మంటలు వచ్చేలా చేసే పనులకు దూరంగా ఉండాలి..

Read Also : Annual Local Toll Pass : రూ.1,500కే ఏడాది లోకల్ టోల్ పాస్.. నెలనెలా కట్టనక్కర్లేదు.. అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలంటే?

ఇరుముడి తీసుకెళ్లేవారు జాగ్రత్త :
శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఇరుముడితో పాటు పూజా సామగ్రిని కూడా తీసుకెళ్తుంటారు. అయితే, పూజా సామగ్రిని తీసుకెళ్లడం వేరు.. వాటిని రైలులో వెలిగించి పూజలు చేయడం వేరు. పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, బాణసంచా వంటి ప్రమాదకర వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. కర్పూరం, అగరబత్తుల ప్యాకెట్లను తీసుకెళ్లే విషయంలో మాత్రం ముందుగానే రైల్వే అధికారులను సంప్రదించి క్లారిటీ తీసుకోండి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు :
రైలు ప్రయాణంలో ఇతర ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. నేర తీవ్రతను బట్టి జరిమానా లేదా ఇతర శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వాములు ప్రయాణానికి ముందే రైల్వే నిబంధనలు తెలుసుకోవాలి. భక్తి, భద్రత రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రయాణం సాగించాలి..