Jagan vs Sharmila : యలహంక ప్యాలెస్ వివాదం మరో మలుపు.. షర్మిలకు జగన్ షాక్!

Jagan vs Sharmila : యలహంక ప్యాలెస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. షర్మిల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించడంతో అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదం మరింత ముదిరింది. పూర్తి వివరాలివే..

Jagan vs Sharmila: Family Property Dispute

  • అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి చిచ్చు..
  • యలహంక ప్యాలెస్ కోసం కోర్టుకెక్కిన జగన్
  • షర్మిలను రానివ్వొద్దంటూ జగన్ పిటిషన్
  • ప్యాలెస్‌పై జగన్, షర్మిల మధ్య న్యాయపోరు

Jagan vs Sharmila : వైఎస్ కుటుంబంలో యలహంక ప్యాలెస్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే ఆస్తుల పంపకాల విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు బయటపడగా.. తాజాగా ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోకి తన సోదరి షర్మిల రాకుండా అడ్డుకోవాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది..

స్టే ఇవ్వాలంటూ కోర్టుకు వినతి :
దేవనహళ్లి కోర్టులో సిలికాన్ బిల్డర్స్ లిమిటెడ్ పేరుతో జగన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తన కుమార్తె అంజిలి పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల ఆదివారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన జగన్.. ఆమె ప్యాలెస్‌లోకి ప్రవేశించకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరినట్లు తెలిసింది..

Read Also : Annual Local Toll Pass : రూ.1,500కే ఏడాది లోకల్ టోల్ పాస్.. నెలనెలా కట్టనక్కర్లేదు.. అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలంటే?

జగన్ అభ్యంతరం.. వివాహ వేడుక మార్పు :
నిజానికి అంజిలి వివాహాన్ని ఇదే ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు. అయితే, ఈ పెళ్లి వేడుకకు జగన్ అభ్యంతరం చెప్పడంతో చివరకు వివాహ వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. తాను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి నిర్వహిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని, తన కుటుంబ భద్రత దృష్ట్యా అక్కడ వివాహం వద్దని జగన్ గతంలో లేఖ రాశారు..

యలహంక భూమి షర్మిలదే.. :
మరోవైపు, 2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. యలహంక ఆస్తిపై తనకే హక్కులు ఉన్నాయని షర్మిల వాదిస్తున్నారు. ఈ విషయంలో తల్లి విజయమ్మ కూడా గతంలో షర్మిలకు మద్దతుగా ప్రకటన విడుదల చేశారు. యలహంక భూమి షర్మిలదేనని, ఆస్తుల పంపకాలపై తనకు స్పష్టత ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇలా ఒకవైపు జగన్ అభ్యంతరాలు, మరోవైపు షర్మిల హక్కుల వాదనతో వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు షర్మిల సిద్ధమవుతున్న వేళ.. దేవనహళ్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది..