DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
కడప డివిజన్లో అటవీశాఖ దాడుల్లో 114 ఎర్రచందనం దుంగలు, 7 వాహనాలు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేయగా, స్మగ్లర్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (DCM Pawan Kalyan)హెచ్చరించారు.
DCM Pawan kalyan warns red sanders smugglers 114 logs 7 vehicles seized in kadapa
DCM Pawan Kalyan: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ, దుంగ వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కడప డివిజన్ పరిధిలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో సుమారు 114 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆంబులెన్స్‌లు, కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేసిన అధికారులు, ఏడు వాహనాలను కూడా సీజ్ చేశారు.
అధికారులకు పవన్ అభినందనలు.. దారులన్నీ మూసేయాలని ఆదేశం:
ప్రత్యేక ఆపరేషన్‌లో సమన్వయంతో, వ్యూహాత్మకంగా పనిచేసి నిందితులను పట్టుకున్న కడప జిల్లా అటవీశాఖ అధికారి, సిబ్బందిని పవన్ కల్యాణ్ (DCM Pawan Kalyan)అభినందించారు.
అక్రమ రవాణా ఎక్కడా జరగకుండా అన్ని దారులూ మూసుకుపోయేలా ఆపరేషన్స్ నిర్వహించాలని యాంటి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సూచించారు. ఆపరేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, అటవీ సంపదను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.
పరారీలో ఉన్న వారి కోసం గాలింపు.. స్మగ్లింగ్ మూలాలపై దర్యాప్తు:
అక్రమ రవాణా వ్యవహారంలో తప్పించుకున్న ఇతర నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్మగ్లింగ్ మూలాలు పూర్తిగా బయటపడే విధంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. అటవీ సంపదను కొల్లగొట్టి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు.
