Xiaomi 18 Max Leak : ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 8000mAh బ్యాటరీతో షావోమీ 18 మ్యాక్స్ వస్తోంది.. ఫీచర్లపై భారీ అంచనాలు..!
Xiaomi 18 Max Leak : 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్, 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో షావోమీ 18 మ్యాక్స్ త్వరలో మార్కెట్లోకి రావచ్చు.. షావోమీ ఫోన్ ఫీచర్లు, అంచనాలపై పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 22, 2026 / 07:16 PM IST
Xiaomi 18 Max Leak
- 8000mAh బ్యాటరీతో షావోమీ కొత్త ఫోన్..
- చిన్న సైజులో భారీ పవర్.. షావోమీ 18 మ్యాక్స్ ఫీచర్లు లీక్
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌తో కొత్త షావోమీ ఫోన్
Xiaomi 18 Max Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి పండగే.. షావోమీ మరో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది. అదే షావోమీ 18 మ్యాక్స్.. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే 8000mAh బ్యాటరీ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది..
8000mAh బ్యాటరీ.. బ్యాకప్ అదుర్స్ :
లీకైన సమాచారం ప్రకారం.. షావోమీ 18 మ్యాక్స్‌లో ఏకంగా 8000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే చాలా భారీ బ్యాటరీ అందిస్తుంది. దీంతో ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి మంచి బ్యాకప్ అందిస్తుందని అంచనా. అయితే, ఛార్జింగ్ స్పీడ్‌కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు..
Read Also : iQOO 16R Launch : ఐక్యూ 16R వచ్చేస్తోంది.. 6,680 మల్టీకోర్ స్కోర్‌తో అదరగొట్టిన కొత్త స్మార్ట్‌ఫోన్!
స్నాప్‌డ్రాగన్ పవర్‌తో అదిరిపోయే పర్ఫార్మెన్స్ :
ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్ ఉండవచ్చు. ఇది నిజమైతే గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే అవకాశం ఉంది. కెమెరా విషయానికి వస్తే.. భారీ సెన్సార్‌తో కెమెరాను అందించనుంది. ఫొటోగ్రఫీ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్ కావచ్చు..
16GB ర్యామ్, 1TB స్టోరేజ్ :
వేరియంట్ల విషయానికి వస్తే.. బేస్ మోడల్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రావచ్చని తెలుస్తోంది. టాప్ వేరియంట్‌లో 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఉండొచ్చు.. అలాగే 6.4 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌ను అందించనుంది.
గతంలో వచ్చిన షావోమీ 17 మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, 200MP కెమెరా ఉన్నాయి. అయితే, కొత్త మోడల్ కాంపాక్ట్ డిజైన్‌తో మరిన్ని అప్‌గ్రేడ్స్ తీసుకురావచ్చని అంచనా. వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ధర, పూర్తి ఫీచర్లు, లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
