WhatsApp Scheduled Messages : వాట్సాప్‌లో ఖతర్నాక్ ఫీచర్.. ఇకపై మీ బదులు అదే మెసేజ్ పంపిస్తుంది.. ఎలాగంటే?
WhatsApp Scheduled Messages : వాట్సాప్‌లో కొత్తగా మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ రాబోతోంది. ముందుగానే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు షెడ్యూల్ చేసి నచ్చిన సమయంలో పంపించుకోవచ్చు.. అది ఎలాగంటే?..
- Sreehari A
- Published on- November 26, 2026 / 02:11 PM IST
WhatsApp Scheduled Messages
- బర్త్‌డే విషెస్, రిమైండర్స్ మర్చిపోకండి
- వాట్సాప్‌లో మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్
- కొత్త ఫీచర్‌తో ఎన్నో లాభాలో తెలుసా?
WhatsApp Scheduled Messages : వాట్సాప్ యూజర్లకు పండగే.. మీ ప్రియమైనవారికి బర్త్ డే విషెస్ ముందుగా చెప్పాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం వాట్సాప్ అద్భుతమైన ఫీచర్ తీసుకువస్తోంది.. ఇకపై విషెస్ చెప్పడం మర్చిపోలేరు.. మీరు అనుకున్న టైంకు ఆటోమాటిక్ మెసేజ్ వెళ్లిపోతుంది..
సాధారణంగా చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఎంత గుర్తుపెట్టుకున్నా కొన్నిసార్లు ముఖ్యమైన తేదీలు మర్చిపోతుంటారు. ముఖ్యంగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల పుట్టినరోజులు వచ్చినప్పుడు విషెస్ చెప్పడం మిస్ అవుతుంటారు.
అర్ధరాత్రి 12 గంటలకు విషెస్ చెప్పాలని అనుకున్నా నిద్రలోనే ఆ సమయం దాటిపోతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్.. ఇంతకీ ఇదేలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : Apple Kukatpally Store : హైదరాబాద్‌లో ఆపిల్ సందడి.. డిసెంబర్ 10న ఫస్ట్ స్టోర్ ప్రారంభం.. ప్రత్యేకతలివే..!
ఇకపై ముందుగానే మెసేజ్ రాసి పెట్టుకోవచ్చు :
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు తమకు నచ్చిన మెసేజ్‌ను ముందుగానే టైప్ చేసి, అది ఎప్పుడు డెలివరీ కావాలో డేట్, టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్ బర్త్‌డేకు అర్ధరాత్రి 12 గంటలకు విషెస్ వెళ్లాలనుకుంటే.. ముందుగానే మెసేజ్ రాసి టైమ్ సెట్ చేస్తే సరిపోతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు మీటింగ్ రిమైండర్లు, గుడ్ లక్ మెసేజ్‌లు కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.
ఎలా షెడ్యూల్ చేయాలంటే? :
ముందుగా ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మెసేజ్ టైప్ చేసి సెండ్ బటన్‌ను ట్యాప్ చేసి పట్టుకోవాలి. అప్పుడు షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో డేట్, టైమ్ ఎంచుకుంటే మెసేజ్ ఆటోమేటిక్‌గా వెళ్లిపోతుంది. టెక్స్ట్ మాత్రమే కాకుండా ఫొటోలు, వీడియోలను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు..
ఫోన్ ఆఫ్‌లో ఉన్నా మెసేజ్ వెళ్తుందా? :
ఈ ఫీచర్లో మరో స్పెషాలిటీ ఏమిటంటే.. షెడ్యూల్ చేసిన సమయంలో మీ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా, బ్యాటరీ అయిపోయినా మెసేజ్ డెలివరీ అవుతుంది. అంతేకాదు.. సాధారణ వాట్సాప్ మెసేజ్‌ల మాదిరిగానే ఇవి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సేఫ్ ఉంటాయి.
పంపించేలోపు మనసు మార్చుకుంటే షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా మెటా సొంత యాప్ ప్రయత్నిస్తోంది. మొత్తానికి ముఖ్యమైన తేదీలు మర్చిపోయే వారికి ఈ కొత్త ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
