Samsung Galaxy S27 Series : షాకివ్వనున్న శాంసంగ్.. గెలాక్సీ S27 సిరీస్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. కారణం ఇదే!
Samsung Galaxy S27 Series : శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మెమరీ చిప్స్ ధరలు పెరగనున్నాయి. కొత్త గెలాక్సీ S27 ప్రో మోడల్ ఫీచర్లు, ఎక్సినోస్ 2700 చిప్సెట్ వివరాలివే..
Samsung Galaxy S27 Series
- శాంసంగ్ గెలాక్సీ S27 కొనాలనుకుంటున్నారా?
- గెలాక్సీ S27 సిరీస్ ధరలు పెరగనున్నాయా?
- కొత్త ప్రో మోడల్.. ధరలు, ఫీచర్లపై ఆసక్తికర అప్డేట్
Samsung Galaxy S27 Series : స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్డేట్. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ ధరలు గత మోడళ్లతో పోలిస్తే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్య కారణం మెమరీ చిప్స్ ధరలు భారీగా పెరగడమే… శాంసంగ్ ఫోన్ తయారీ ఖర్చులు పెరిగితే ఆ భారం చివరికి కొనుగోలుదారులపైనే పడే అవకాశం కనిపిస్తోంది..
గెలాక్సీ S27 సిరీస్ ధరలపై ప్రభావం? :
ఇటీవల మెమరీ కాంపోనెంట్ల ధరలు రెట్టింపునకు మించి పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు చిప్సెట్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. శాంసంగ్ సొంత స్మార్ట్ఫోన్ల కోసం మెమరీ భాగాలను సమకూర్చుకోవడంతో పాటు ఏఐ సేవల అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టింది.
Read Also : Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ భారీ షాక్.. లిబియా తీరంలో యుద్ధనౌకను పేల్చేశాం.. జెలెన్స్కీ వీడియో!
దీంతో సర్వర్లకు అవసరమైన మెమరీపై కూడా కంపెనీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఈ పరిణామాలన్నీ గెలాక్సీ S27 సిరీస్ ధరలపై ప్రభావం చూపవచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
మరోవైపు ఈసారి గెలాక్సీ S27 సిరీస్‌లో కొత్తగా ప్రో మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే SM-S957B మోడల్ నంబర్‌తో ఓ శాంసంగ్ ఫోన్ గీక్ బెంచ్‌లో కనిపించినట్లు టిప్‌స్టర్ వెల్లడించారు. ఈ ఫోన్లో ఎక్సినోస్ 2700 చిప్సెట్ ఉండవచ్చని అంచనా. అయితే, దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లీకైన వివరాల ప్రకారం.. :
ఈ ఫోన్లో 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 ఉండవచ్చు. గీక్ బెంచ్ పరీక్షల్లో సింగిల్ కోర్ విభాగంలో 3,061 పాయింట్లు, మల్టీ కోర్ విభాగంలో 10,967 పాయింట్లు సాధించింది. ఎక్స్ క్లిప్స్ 970 జీపీయూ కూడా ఇందులో ఉండొచ్చని అంచనా..
కెమెరాల విషయానికి వస్తే.. :
బ్యాక్ సైడ్ హారిజాంటల్ డిజైన్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్, 200MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి లీకులు, అంచనాలు మాత్రమే. శాంసంగ్ అధికారికంగా ప్రకటించే వరకు ధరలు, ఫీచర్లపై క్లారిటీ రాదు. కొత్త ప్రో మోడల్ నిజంగా వస్తుందా? ధర ఎంత ఉండబోతోంది? అనేది వేచి చూడాల్సిందే..
