HONOR 700 Series : హానర్ 700, 700 ప్రో, 700s వచ్చేశాయ్.. ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
HONOR 700 Series : హానర్ 700, 700 ప్రో, 700ఎస్ స్మార్ట్ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ, బ్యాక్ సెకండరీ స్క్రీన్, ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు వివరాలివే..
HONOR 700 Series
- భారీ బ్యాటరీతో హానర్ 700 సిరీస్ లాంచ్
- 9,000mAh బ్యాటరీతో హానర్ కొత్త స్మార్ట్ఫోన్లు
- సెల్ఫీల నుంచి నోటిఫికేషన్ల వరకు..
HONOR 700 Series : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రముఖ టెక్ బ్రాండ్ హానర్ సరికొత్త ఫోన్లతో ముందుకొచ్చింది. ఒకటి కాదు.. ఏకంగా 3 కొత్త స్మార్ట్ఫోన్లను ఒకేసారి చైనాలో లాంచ్ చేసింది.
హానర్ 700, హానర్ 700 ప్రో, హానర్ 700ఎస్ పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీ, 200MP కెమెరా, బ్యాక్ సైడ్ ప్రత్యేకమైన సెకండరీ డిస్ప్లేతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫోన్ బ్యాక్ సైడ్ ఇచ్చిన చిన్న స్క్రీన్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది..
ధర ఎంతంటే? :
12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్లో హానర్ 700ఎస్ ధర 3,599 యువాన్లు (సుమారు రూ.50వేలు)గా ఉంది. హానర్ 700 ధర 3,999 యువాన్లు (దాదాపు రూ.56వేలు) కాగా, టాప్ మోడల్ హానర్ 700 ప్రో ధర 4,599 యువాన్లు (సుమారు రూ.64వేలు)గా నిర్ణయించారు. ప్రస్తుతం చైనాలో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్ 27 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. భారత్‌లో లాంచ్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
Read Also : NVIDIA Jensen Huang : ఎన్వీడియా CEOగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..
వెనుక స్క్రీన్‌తో ప్రత్యేక ఆకర్షణ :
ఈ 3 ఫోన్లలోనూ 6.57 అంగుళాల 1.5K LTPS డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 1.59 అంగుళాల ఫ్లోటింగ్ ఐలాండ్ స్క్రీన్ ఇచ్చారు. తద్వారా నోటిఫికేషన్లు చూడటంతో పాటు మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాతో సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఈ స్క్రీన్ వ్యూఫైండర్లా ఉంటుంది.
కెమెరా, బ్యాటరీ అదుర్స్ :
ఈ 3 మోడళ్లలోనూ 200MP మెయిన్ కెమెరా, 9,000mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. హానర్ 700, 700 ప్రో ఫోన్లలో అదనంగా 12MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ప్రో మోడల్లో 50W వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ప్రాసెసర్‌లో తేడాలివే :
హానర్ 700 ప్రోలో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5, హానర్ 700లో స్నాప్ డ్రాగన్ 8s జెన్ 4, హానర్ 700Sలో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్లను అందించారు. మూడు ఫోన్లూ మ్యాజిక్ ఓఎస్11పై పనిచేస్తాయి. IP68, IP69, IP69K రేటింగ్‌లతో రావడం మరో ప్రత్యేకత. మొత్తానికి భారీ బ్యాటరీ, కెమెరా, కొత్త డిజైన్‌తో హానర్ 700 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది..
