Vivo X500 Series Launch : ఐఫోన్‌కు పోటీగా వివో 3 కొత్త ఫోన్లు.. వివో X500 సిరీస్ ధరలు లీక్.. బేస్ మోడల్‌కే రూ.1.19 లక్షలా?

Vivo X500 Series Launch : వివో X500 సిరీస్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. వివో X500, వివో X500 ప్రో, ప్రో మ్యాక్స్ ధరలు లీక్ అయ్యాయి. ఫీచర్లు, కెమెరా వివరాలు, వివో వాచ్ GT 2 ధరపై ఓ లుక్కేయండి..

Vivo X500 Series Launch

  • వివో నుంచి మూడు ప్రీమియం ఫోన్లు..
  • వివో X500 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షలు
  • కెమెరా, డిస్‌ప్లే అదుర్స్..
  • త్వరలో భారత్‌లోకి వివో X500 సిరీస్ ఎంట్రీ

Vivo X500 Series Launch : వివో లవర్స్ మీకోసమే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటనుంది.. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ కొత్త వివో X500 సిరీస్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సిరీస్‌లో వివో X500, X500 ప్రో, X500 ప్రో మ్యాక్స్ మోడళ్లు రానున్నాయి. వివో వాచ్ GT 2 కూడా మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. అయితే, లాంచ్‌కు ముందే ఈ ఫోన్ల ధరలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది..

లీకైన సమాచారం ప్రకారం.. :
వివో X500 (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ.1,19,999గా ఉండొచ్చు. ఇక వివో X500 ప్రో ఇదే స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,999గా తెలుస్తోంది. మరోవైపు వివో X500 ప్రో మ్యాక్స్ 12GB + 256GB వేరియంట్ ధర రూ.1,59,999గా, 12GB + 512GB వేరియంట్ ధర రూ.1,49,999గా ఉండొచ్చు. వివో వాచ్ జీటీ 2 ధర రూ.14,999గా ఉండొచ్చని సమాచారం. అయితే, ఇవన్నీ లీకైన ధరలే.. కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..

Read Also : EPFO New Rules 2026 : PF ఉన్నవారికి డబుల్ ధమాకా.. ఇక 90 శాతం డబ్బులు తీసుకోవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్..

భారత్ మార్కెట్లోనే లాంచ్.. :
నవంబర్ 26న ఈ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.. వివో ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. :
వివో X500లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 9600M ప్రాసెసర్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో మరింత భారీ డిస్‌ప్లేలు, డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్ ఉండనున్నాయి. మొత్తానికి ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి..