Redmi Turbo 6 Max Launch : 7 అంగుళాల భారీ డిస్ప్లే.. 10,000mAh బ్యాటరీతో రెడ్మి కొత్త ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!
Redmi Turbo 6 Max Launch : రెడ్మి టర్బో 6 మ్యాక్స్ అతి త్వరలో లాంచ్ కానుంది. 7 అంగుళాల 2K డిస్ప్లే, 185Hz రిఫ్రెష్ రేట్, 10,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ వంటి ఫీచర్లపై ఆసక్తికరమైన లీకులివే..
Redmi Turbo 6 Max Launch
- ఛార్జింగ్ టెన్షన్ లేకుండా భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్
- 185Hz రిఫ్రెష్ రేట్‌తో రెడ్మి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్
- 7 ఇంచుల స్క్రీన్, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో మ్యాక్స్ మోడల్
- రెడ్మి టర్బో 6 మ్యాక్స్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్
Redmi Turbo 6 Max Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో కొత్త సంచలనం రాబోతోందా? భారీ డిస్ప్లే, అదిరిపోయే బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రెడ్మి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అదే రెడ్మి టర్బో 6 సిరీస్..
ఈ సిరీస్‌లో స్టాండర్డ్ మోడల్‌తో పాటురెడ్మి టర్బో 6 మ్యాక్స్ కూడా లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కొత్త సిరీస్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు లీక్ కావడంతో స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో మరింత ఆసక్తి నెలకొంది..
లేటెస్టుగా చైనాలో రెడ్మి టర్బో 6 సిరీస్‌కు రేడియో సర్టిఫికేషన్ లభించినట్లు టెక్ రిపోర్టులు వెల్లడించాయి. M407CF మోడల్ నంబర్‌తో ఉన్న ఫోన్ సర్టిఫికేషన్ లిస్టులో కనిపించింది. ఈ ఫోన్ 5జీ, బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీకి సపోర్ట్ చేయనుంది. దీంతో ఈ సిరీస్ లాంచ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది..
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
ఇక ఈ సిరీస్‌లో రెడ్మి టర్బో 6 మ్యాక్స్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. లీకుల ప్రకారం.. ఇందులో ఏకంగా 7 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఉండొచ్చు. దీనికి 2K రిజల్యూషన్, 185Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉంది. అంతేకాదు.. స్క్రీన్ చుట్టూ చాలా తక్కువ బెజెల్స్ ఉండేలా ఎల్ఐపీఓ టెక్నాలజీతో రానున్నట్టు తెలుస్తోంది..
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్సెట్తో వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయంలోనూ రెడ్మి భారీ ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యంతో బ్యాటరీ అందించవచ్చని అంచనా. మెటల్ ఫ్రేమ్, డ్యూయల్ రియర్ కెమెరాలు, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండొచ్చని సమాచారం..
ఈ ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో పోకో ఎక్స్9 ప్రో మ్యాక్స్ పేరుతో అందుబాటులోకి రావచ్చని టాక్. అయితే, కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే..
