PM Surya Ghar Scheme : ఇంటిపై సోలార్ పెట్టించుకోవాలా? ఏపీ సర్కార్ భారీ టార్గెట్.. ఈ నెలాఖరులోగా కీలక నిర్ణయం!
PM Surya Ghar Scheme : ఏపీలో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాట్లపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఈ నెలాఖరులోగా 9 లక్షల సోలార్ కనెక్షన్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పూర్తి వివరాలివే..
PM Surya Ghar Scheme
- ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..
- ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ దిశగా చంద్రబాబు అడుగులు
- కరెంట్ బిల్లులకు చెక్ పెట్టే ప్లాన్..
- 9 లక్షల సోలార్ కనెక్షన్లే టార్గెట్
PM Surya Ghar Scheme : ఏపీ ప్రజలకు తీపికబురు.. ఇకపై కరెంట్ బిల్లుల భారం తగ్గనుంది. రాష్ట్ర ప్రజలకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఏపీలో ప్రతి ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నిర్వహించిన ఇంధన శాఖ సమీక్షలో ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం సూర్య ఘర్ పథకాన్ని మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
నెలాఖరులోగా ఏకంగా 9 లక్షల కనెక్షన్లు :
ప్రస్తుతం ఈ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు 7.42 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. అయితే, ఇక్కడితో ఆగకుండా ఈ నెలాఖరులోగా ఏకంగా 9 లక్షల పీఎం సూర్య ఘర్ కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంటే రాష్ట్రంలో మరిన్ని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది అనమాట..
Read Also : YS Jagan ED Chargesheet : జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో షాక్ .. కొత్త ఛార్జిషీట్ దాఖలు!
224 ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు :
మరోవైపు.. వ్యవసాయ రంగంలోనూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన భూసేకరణ పూర్తవగా, సివిల్ పనులు కూడా 91 శాతం వరకు పూర్తయ్యాయి.
ఇక రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీ కారిడార్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే 6 నెలల్లో విద్యుత్ డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు..
2,962 విద్యాసంస్థల ఎంపిక.. :
అంతేకాదు.. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలోనూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2,962 విద్యాసంస్థలను ఎంపిక చేసే ప్రణాళిక ఉంది. మొత్తానికి ఇళ్ల నుంచి విద్యాసంస్థల వరకు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది..
