WhatsApp Travel eSIM : విదేశాలకు వెళ్తున్నారా? వాట్సాప్‌లోనే ట్రావెల్ eSIM కొనేసుకోండి.. రోమింగ్ ఛార్జీల టెన్షన్ ఉండదు!
WhatsApp Travel eSIM : వాట్సాప్‌లోకి త్వరలో ట్రావెల్ eSIM ఫీచర్ రానుంది. విదేశాలకు వెళ్లేవారు యాప్‌లోనే eSIM కొనుగోలు చేసి మొబైల్ డేటా ఉపయోగించుకోవచ్చు. కొత్త ఫీచర్ పూర్తి వివరాలివే..
WhatsApp Travel eSIM
- వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..
- విదేశాలకు వెళ్లినా ఇంటర్నెట్ కష్టాలు ఉండవు..
- వాట్సాప్‌లోనే ట్రావెల్ eSIM కొనేసుకోండి
- ఎయిర్‌పోర్టులో సిమ్ కార్డుల కోసం వెతకాల్సిన పనిలేదు..
WhatsApp Travel eSIM : విదేశాలకు వెళ్తున్నారా? మీకో అదిరిపోయే న్యూస్.. సాధారణంగా ఫారెన్ వెళ్లినప్పుడు ఇంటర్నెట్ కోసం పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్‌పోర్టులో దిగగానే లోకల్ సిమ్ కార్డు కోసం వెతకడం, పబ్లిక్ వై-ఫై కోసం ఎదురుచూడటం, రోమింగ్ ఛార్జీల గురించి ఆలోచించడం.. ఇవన్నీ ఇకపై అవసరం లేకపోవచ్చు.
ఎందుకంటే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రయాణికుల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇకపై యాప్‌లోనే ట్రావెల్ eSIM కొనుగోలు చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్‌లోనే eSIM కొనుగోలు :
సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి మొబైల్ డేటా కోసం ప్రత్యేకంగా సిమ్ కార్డు కొనాల్సి వస్తుంది. అయితే, వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో ఇది చాలా ఈజీ కానుంది. యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొన్ని ట్యాప్స్‌తో ట్రావెల్ eSIM కొనుగోలు చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో విదేశాల్లో దిగిన వెంటనే మొబైల్ డేటా వాడే అవకాశం ఉంటుంది..
Read Also : SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రావెల్ eSIM వాడిన వాట్సాప్‌లో మన పాత ఫోన్ నంబర్‌నే కొనసాగించవచ్చు. అంటే.. కొత్త సిమ్ తీసుకున్నంత మాత్రాన వాట్సాప్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కుటుంబ సభ్యులతో చాటింగ్ చేయడం, ఫొటోలు పంపడం, కాల్స్ మాట్లాడటం యథావిధిగా కొనసాగించవచ్చు.
టెలికాం సంస్థలతో భాగస్వామ్యం :
ఈ ఫీచర్ కోసం వాట్సాప్ పలు eSIM ప్రొవైడర్లు, టెలికాం సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో జియో, స్మార్ట్ అక్షియాటా, స్మార్ట్ కమ్యూనికేషన్స్, వెరిజోన్ వంటి సంస్థలు ఉన్నాయి.
అయితే, ఈ సర్వీసు ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తుంది? eSIM ధర ఎంత ఉంటుంది? ఏ ఫోన్లలో పనిచేస్తుంది? అనే వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. తొలుత కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మొత్తానికి విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఈ ఫీచర్ అద్భతంగా ఉంటుంది.
