Samsung Galaxy A18 4G : తక్కువ ధరలో సూపర్ శాంసంగ్ ఫోన్.. ధర జస్ట్ రూ. 24వేలు మాత్రమే.. ఫీచర్లు మాత్రం కేక.. !
Samsung Galaxy A18 4G : శాంసంగ్ గెలాక్సీ A18 4జీ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రేలియాలో లాంచ్ అయింది. 90Hz సూపర్ అమోల్డ్ డిస్ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ధర తదితర పూర్తి వివరాలివే..
Samsung Galaxy A18 4G
- 5000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చేసింది
- 50MP కెమెరా, IP64 రేటింగ్ కూడా పొందింది
- 90Hz అమోల్డ్ స్క్రీన్, 25W ఛార్జింగ్..
- శాంసంగ్ కొత్త ఫోన్ ధర ఎంతో తెలుసా?
Samsung Galaxy A18 4G Launch : బడ్జెట్ ధరలో మంచి డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, శాంసంగ్ తీసుకొచ్చిన కొత్త ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ A18 4జీను మరో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే యూరప్, సింగపూర్ మార్కెట్లలో అడుగుపెట్టిన ఈ ఫోన్ తాజాగా ఆస్ట్రేలియాలో అందుబాటులోకి వచ్చింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ A18 4జీ ధర ఎంత? :
ఆస్ట్రేలియాలో శాంసంగ్ గెలాక్సీ A18 4జీ ఫోన్ ధరను AUD 399గా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.24వేలు ఉంటుంది. శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, లైట్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 26 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి..
ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు :
ఈ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్, 2,340 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో స్క్రీన్ మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ అందించనుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ను అందించారు.
ఇక ప్రాసెసర్ వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు. ఇందులో 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ వన్ యూఐ 9పై రన్ అవుతుంది. 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్లు, మరో 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ తెలిపింది.
కెమెరా, బ్యాటరీ ప్రత్యేకతలివే :
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 3 కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ 13MP కెమెరా ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే..
5,000mAh సామర్థ్యంతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4G ఎల్టీఈ, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, USB-C కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు IP64 రేటింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంతవరకు ప్రొటెక్షన్ లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేవిషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.
