OnePlus Turbo 6Xs Launch : రూ.28 వేలకే వన్‌ప్లస్ కొత్త ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో టర్బో 6Xs లాంచ్!

OnePlus Turbo 6Xs Launch : వన్‌ప్లస్ టర్బో 6Xs చైనాలో లాంచ్ అయింది. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్, ధర, పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

OnePlus Turbo 6Xs Launch

  • వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది..
  • 7000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే..
  • తక్కువ ధరకే వన్‌ప్లస్ కొత్త ఫోన్ లాంచ్
  • 50MP కెమెరా, భారీ బ్యాటరీ ప్రత్యేకతలు

OnePlus Turbo 6Xs Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ మరో కొత్త ఫోన్‌తో సందడి చేస్తోంది. ఆకట్టుకునే ఫీచర్లు, భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ టర్బో 6Xsను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి ఈ మోడల్ అద్భుతంగా ఉంటుంది. 7000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, 50MP మెయిన్ కెమెరా వంటి స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ ఫోన్ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

వన్‌ప్లస్ టర్బో 6Xs ధర ఎంత? :
వన్‌ప్లస్ టర్బో 6Xs ధర చైనా మార్కెట్లో CNY 1,999గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఈ ఫోన్ వాల్యూ సుమారు రూ.28వేలు ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కూడా విక్రయిస్తోంది. అయితే, భారత మార్కెట్లో లాంచ్, ధరకు సంబంధించి ప్రస్తుతానికి క్లారిటీ లేదు..

వన్‌ప్లస్ టర్బో 6Xs ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ సమయంలో స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ మరింత స్మూత్‌గా ఉంటుంది.

Read Also : Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. 4nm టెక్నాలజీతో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రాసెసర్‌ను అమర్చారు. 6GB ర్యామ్, 256GB స్టోరేజ్ అందించారు. మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 16తో రన్ అవుతుంది.

కెమెరా, బ్యాటరీ ఫీచర్లు :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో అందరి దృష్టిని ఆకర్షించే మరో ఫీచర్ 7000mAh బ్యాటరీ. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

NFC, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. 8.55mm మందం, 208 గ్రాముల బరువుతో ఈ ఫోన్ వస్తుంది. మొత్తంగా భారీ బ్యాటరీ, ఫాస్ట్ డిస్‌ప్లే కోరుకునే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.