Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
Post Office RD Scheme : నెలకు రూ.2వేలు పోస్టాఫీస్ RD పథకంలో ఐదేళ్ల పాటు పొదుపు చేస్తే.. ఎంత మొత్తం వస్తుంది? 6.7 శాతం వడ్డీతో మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ ఆదాయం, ఖాతా ప్రారంభించే విధానం పూర్తి వివరాలేంటో చూద్దాం..
Post Office RD Scheme
- చిన్న పొదుపుతో పెద్ద మొత్తం..
- ఐదేళ్లలో ఎంత వడ్డీ వస్తుందంటే?
- పోస్టాఫీస్‌లో నెలకు రూ.2వేలు కట్టండి..
- ఐదేళ్ల తర్వాత భారీ మొత్తం పొందండి
Post Office RD Scheme : చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు చేయడం చాలా ఈజీ.. కానీ, భవిష్యత్తు అవసరాల కోసం కొంతైనా దాచుకోవాలంటే మాత్రం చాలామంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ (RD) పథకం అద్భుతంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతినెలా చిన్న మొత్తాన్ని జమ చేసుకుంటూ మంచి మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు..
నెలకు రూ.2వేలు సేవింగ్.. ఎంత వస్తుంది? :
పోస్టాఫీస్ ఐదేళ్ల RD పథకంలో ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఈ వడ్డీని త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. ఈ రేటు ప్రకారం.. నెలకు రూ.2వేలు చొప్పున ఐదేళ్ల పాటు జమ చేస్తే మంచి మొత్తమే చేతికి వస్తుంది..
Read Also : iQOO 15R Price Drop : రూ. 77,999 ఫోన్ ఇప్పుడు రూ. 59,999కే.. ఐక్యూ 15Rపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..
పెట్టుబడి లెక్కలివే.. :
- నెలవారీ డిపాజిట్ : రూ.2,000
- పెట్టుబడి కాలం : 5 సంవత్సరాలు
- మొత్తం నెలవారీ వాయిదాలు : 60 నెలలు
- మీరు జమ చేసే మొత్తం : రూ.1,20,000
- అంచనా వడ్డీ : రూ.22,732
- మెచ్యూరిటీ మొత్తం : సుమారు రూ.1,42,732
అంటే ప్రతినెలా రూ.2వేలు పక్కన పెడితే ఐదేళ్లకు దాదాపు రూ.1.43 లక్షలు పొందవచ్చు. చిన్న మొత్తంతోనే క్రమంగా పొదుపు చేయాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది.
ఎవరు ఖాతా తెరవొచ్చు? :
భారతీయ పౌరులు వ్యక్తిగతంగా పోస్టాఫీస్ RD ఖాతా ప్రారంభించవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా తెరవొచ్చు. పిల్లల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కూడా ఖాతా ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్లు నిబంధనల ప్రకారం సొంతంగా ఖాతా తెరవవచ్చు..
ఖాతా ఎలా తెరవాలి? :
ఆధార్, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, ఫొటోలు తీసుకుని దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లాలి. అక్కడ అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి ఖాతా ఓపెన్ చేయొచ్చు. అయితే, పెట్టుబడి పెట్టే ముందు అప్పటి వడ్డీ రేటు, ఖాతా నిబంధనలు, ఆలస్యంగా వాయిదాలు చెల్లిస్తే వర్తించే ఛార్జీల గురించి తెలుసుకోవడం మంచిది. చిన్న మొత్తంతో మొదలుపెట్టినా క్రమశిక్షణతో పొదుపు చేస్తే భవిష్యత్తుకు మంచి ఆర్థిక భరోసా లభిస్తుంది.
