Motorola Edge 70 Neo Launch : సూపర్ ఫోన్ మావా.. 7000mAh బ్యాటరీతో మోటోరోలా కొత్త ఫోన్.. ధర రూ.30 వేల లోపేనా?
Motorola Edge 70 Neo Launch : 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 70 నియో భారత మార్కెట్‌లోకి వచ్చింది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, అంచనా ధర వివరాలివే..
- Sreehari A
- Published on- November 24, 2026 / 09:03 PM IST
Motorola Edge 70 Neo Launched
- మోటోరోలా ఎడ్జ్ 70 నియో వచ్చేసింది
- 6.8 అంగుళాల డిస్‌ప్లే, 12GB ర్యామ్..
- ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టే ఫోన్..
Motorola Edge 70 Neo Launch : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీరు మోటోరోలా ఫోన్ అభిమానులైతే ఇది మీకోసమే.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి కెమెరా, భారీ డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు.
సరిగ్గా ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ మోటోరోలా తన కొత్త ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 నియోను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో అందించిన ఫీచర్లు ఇప్పుడు టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి..
6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే :
ఈ ఫోన్‌లో మెయిన్ అట్రాక్షన్ అంటే.. 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే. గత మోడల్‌తో పోలిస్తే స్క్రీన్ సైజు పెరిగింది. అంతేకాదు, ఏకంగా 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తున్నారు. దీంతో ఎండలో కూడా స్క్రీన్ క్లియర్ కనిపిస్తుంది. సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వంటి పనులకు ఈ బిగ్ స్క్రీన్ సూపర్ ఆప్షన్..
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. 12GB ర్యామ్ :
పర్ఫార్మెన్స్ విషయంలోనూ మోటోరోలా అద్భుతమైన స్పెసిఫికేషన్లనే అందించింది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ అమర్చారు. దీనికి జతగా గరిష్ఠంగా 12GB ర్యామ్ అందుబాటులో ఉంటుంది. రోజువారీ టాస్కులతో పాటు మల్టీ టాస్కింగ్‌కు కూడా బెస్ట్ ఆప్షన్..
7000mAh బ్యాటరీ.. 50MP కెమెరా :
ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే మరో ఫీచర్.. 7000mAh భారీ బ్యాటరీ. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP సోనీ LYT-710 మెయిన్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ 8.49mm మందం, 204 గ్రాముల బరువుతో వస్తుంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కూడా ఉంది.
ధర ఎంతంటే? :
ధర విషయంలో కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఈ ఫోన్ ధర సుమారు రూ.30వేలు ఉండొచ్చని అంచనా.. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు..
