Lava Smart 4 Pro Launch : లావా కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. 950 గంటల స్టాండ్‌బై.. ధర జస్ట్..!
Lava Smart 4 Pro Launch : లావా స్మార్ట్ 4 ప్రో భారత మార్కెట్లో రూ.10,999 ధరకు లాంచ్ అయింది. 7,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16, 13MP కెమెరా వంటి ఫీచర్లు, ధర, కొనుగోలు వివరాలివే..
- Sreehari A
- Published on- November 21, 2026 / 07:01 PM IST
Lava Smart 4 Pro Launch
- తక్కువ ధరలో లావా స్మార్ట్ 4 ప్రో ఫోన్
- 7,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే
- రూ. 10,999కే లావా కొత్త ఫోన్ మీ సొంతం
Lava Smart 4 Pro Launch : బడ్జెట్‌లో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, లావా కొత్త ఫోన్ మీకోసమే.. భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా లేటెస్టుగా స్మార్ట్ 4 ప్రోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ధర కూడా రూ.10,999 మాత్రమే ఉంటుంద. బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారి దృష్టిని ఆకర్షిస్తోంది..
లావా స్మార్ట్ 4 ప్రో ధర, లభ్యత :
లావా స్మార్ట్ 4 ప్రో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించింది. బ్లూ, కోనార్క్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న లావా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
భారీ బ్యాటరీ.. ఎక్కువ బ్యాకప్ :
ఈ ఫోన్‌లో 7,000mAh లి-అయాన్ బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. కంపెనీ వివరాల ప్రకారం.. ఈ బ్యాటరీ 950 గంటల వరకు స్టాండ్‌బై టైమ్, 748 నిమిషాల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
Read Also : BSNL Recharge Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!
డిస్‌ప్లే, కెమెరాలు :
లావా స్మార్ట్ 4 ప్రోలో 6.75 అంగుళాల HD+ నాచ్ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. UNISOC T610 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో 4GB ర్యామ్, మరో 4GB వర్చువల్ ర్యామ్ అందించారు. 64GB స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు. ఫొటోల కోసం బ్యాక్ సైడ్ 13MP కెమెరా, సెల్ఫీల కోసం స్క్రీన్ ఫ్లాష్‌తో 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్, ఇతర ఫీచర్లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై రన్ అవుతుంది. యాడ్స్, అనవసరమైన యాప్‌లు ఉండవని కంపెనీ చెబుతోంది. సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, MIL-STD-810H డ్రాప్ అండ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. రెండేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని లావా చెబుతోంది.
అంతేకాదు, హ్యాండ్‌సెట్‌పై ఏడాది వారంటీ, యాక్సెసరీలపై 6 నెలల వారంటీతో పాటు ఫ్రీ సర్వీస్@హోమ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. మొత్తంగా లాంగ్ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి ఈ ఫోన్ బడ్జెట్ ఆప్షన్ అని చెప్పొచ్చు..
