Jio New Year Recharge Plans : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా!

Jio New Year Recharge Plans : జియో కొత్త హ్యాపీ న్యూ ఇయర్ 2.0 ఆఫర్లు ప్రకటించింది. రూ.399, రూ.3,999 ప్లాన్లలో అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా, కాల్స్, OTT ప్రయోజనాలు, నైట్ డేటా ప్యాక్ వివరాలు తెలుసుకోండి.

Jio New Year Recharge Plans

  • జియో యూజర్లకు పండగే..
  • రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా
  • జియో కొత్త ప్లాన్ల పూర్తి వివరాలివే

Jio New Year Recharge Plans : రిలయన్స్ జియో గుడ్‌న్యూస్.. ఇక మొబైల్ డేటా అయిపోతుందనే టెన్షన్ అక్కర్లేదు.. నచ్చినంత ఇంటర్నెట్ వాడేసుకోవచ్చు.. పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.399 నెలవారీ ప్లాన్‌తో పాటు, రూ.3,999 వార్షిక ప్లాన్‌ తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.399 ప్లాన్‌లో ఏమేం వస్తాయంటే? :
జియో కొత్తగా ప్రకటించిన రూ.399 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతేకాదు.. రూ.4వేల విలువైన 12 నెలల కాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్, జియో హాట్‌స్టార్ మొబైల్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. దీంతో డేటాతో పాటు అదనపు డిజిటల్ సర్వీసులు కోరుకునే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది.

Read Also : HONOR 700 Series : హానర్ 700, 700 ప్రో, 700s వచ్చేశాయ్.. ధర, ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

ఏడాది మొత్తం రీఛార్జ్ టెన్షన్ ఉండదు :
తరచూ రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారి కోసం రూ.3,999 వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు కాన్వా ప్రో లైట్ 12 నెలల సభ్యత్వం, జియో హాట్‌స్టార్, జియో టీవీ, ఫ్యాన్‌కోడ్, 50జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి.

నైట్ డేటా ప్యాక్ కూడా :
ఇంకా రూ.15, రూ.25తో స్వల్పకాలిక 5జీ డేటా యాడ్ ఆన్ ప్లాన్లను ప్రకటించింది. మరోవైపు రూ.50తో 28 రోజుల వ్యాలిడిటీతో నైట్ డేటా ప్యాక్‌ను అందిస్తోంది. అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా వాడుకోవచ్చు..

ఈ కొత్త ప్లాన్లలో రూ.399, రూ.3,999, రూ.25 ప్లాన్లు నవంబర్ 24 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రూ.50 నైట్ ప్యాక్ నవంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. రూ.15 ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మైజియో యాప్, జియో వెబ్‌సైట్ లేదా రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.