Huawei OSTA O1 Pro : 200MP కెమెరా, 16GB ర్యామ్.. హువావే కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

Huawei OSTA O1 Pro : హువావే ఓస్టా O1 ప్రో ఫోన్ చైనాలో లాంచ్ అయింది. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, కిరిన్ 9030S చిప్‌సెట్, 1.5K డిస్‌ప్లే, ధర, పూర్తి ఫీచర్ల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Huawei OSTA O1 Pro

Huawei OSTA O1 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే విషయంలో కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ హువావే మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

అదే హువావే OSTA O1 ప్రో ఫోన్.. 200MP కెమెరా, భారీ 7000mAh బ్యాటరీ, సొంత కిరిన్ చిప్‌సెట్‌తో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పుడు టెక్ ప్రియులను మరింతగా ఆకర్షిస్తోంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ధర ఎంతంటే? :
ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర 5,499 యువాన్లు. భారత కరెన్సీలో సుమారుగా రూ.76వేలు ఉంటుంది. ఇక 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర 8,799 యువాన్లు. అంటే దాదాపు రూ.1.21 లక్షలు. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్‌పై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు..

హువావే ఫోన్ ఫీచర్లు ఇవే.. :
హువావే ఓస్టా O1 ప్రోలో 6.39 అంగుళాల డిస్‌ప్లే అందించారు. 1.5K రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్ స్పెషల్ 16:9.5 యాస్పెక్ట్ రేషియో ఉంది. ముఖ్యంగా 1.05mm బెజెల్స్, 96.1 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో ఆకట్టుకుంటుంది. ఫోన్ మందం కూడా కేవలం 6.68mm మాత్రమే..

Read Also : Motorola Edge 70 Pro Plus : మోటోరోలా లవర్స్‌కు పండగే.. రూ.47,999 ఫోన్ ఇప్పుడు జస్ట్ రూ. 42,749కే.. ఇంకా తగ్గాలంటే?

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హువావే సొంత కిరిన్ 9030S చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. గరిష్ఠంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ అందించారు. హార్మోనీOS 7 ఏఐ పాయినీర్ ఎడిషన్ ద్వారా వచ్చిన తొలి ఫోన్‌గా కంపెనీ చెబుతోంది.

కెమెరా, బ్యాటరీ స్పెషాలిటీ :
ఫొటోగ్రఫీ కోసం 200MP మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇందులో 3.7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే, అల్ట్రావైడ్ కెమెరా మాత్రం అందించలేదు. ఈ ఫోన్‌లో మరో స్పెషాలిటీ 7000mAh భారీ బ్యాటరీ.

దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ అదనపు ఫీచర్‌గా ఉంది. మొత్తంగా భారీ బ్యాటరీ, హై రిజల్యూషన్ కెమెరా, స్పెషల్ డిస్‌ప్లే డిజైన్‌తో హువావే ఓస్టా O1 ప్రో ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌లో ఆసక్తి రేపుతోంది..