WhatsApp Data Risk : వాట్సాప్ యూజర్లు జాగ్రత్త.. మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? అర్జెంటుగా ఇలా చేయండి!

WhatsApp Data Risk : వాట్సాప్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థ (CERT-In) హై-సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. యాప్‌లో గుర్తించిన లోపాలు, వ్యక్తిగత డేటాకు పొంచి ఉన్న రిస్క్ వంటివి నుంచి సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

WhatsApp Data Risk

  • వాట్సాప్ వాడుతున్నారా?
  • మీ వ్యక్తిగత సమాచారం డేంజర్‌లో
  • ఒక్క మెసేజ్‌తో మీ డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లొచ్చు..
  • మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

WhatsApp Data Risk : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఫోన్‌లో యాప్ ఉందా? వెంటనే ఇలా చేయండి.. చాలామంది రోజూ ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల నుంచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్ల వరకు పంపిస్తుంటారు. అలా ఈ వాట్సాప్ మన జీవితంలో ఒక భాగమైపోయింది.

ఏదైనా చిన్న సమాచారం పంపాలన్నా, అత్యవసరంగా ఎవరినైనా సంప్రదించాలన్నా ముందుగా గుర్తొచ్చేది ఈ యాపే. ఇంతలా మనం నమ్మి వాడుతున్న వాట్సాప్‌లోనే భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్చరించింది. దీంతో వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Motor Insurance Rules : కార్లు, బైకుల యజమానులకు కేంద్రం షాక్.. ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు! భారీగా చెల్లించాల్సిందే?

వాట్సాప్‌లో అసలు సమస్య ఏంటి? :
భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ (CERT-In) నవంబర్ 26న వాట్సాప్‌కు సంబంధించి హైసివియారిటీ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో కొన్ని లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లతో పాటు విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో వాడే వాట్సాప్ వెర్షన్లకు కూడా ఈ వార్నింగ్ వర్తిస్తుంది.

అటాచ్‌మెంట్ స్పూఫింగ్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోపాలు వంటి సాంకేతిక సమస్యలను గుర్తించారు. వీటిని హ్యాకర్లు తమకు అనుకూలంగా వాడుకునే అవకాశం ఉందని CERT-In హెచ్చరించింది.

ముఖ్యంగా ప్రత్యేకంగా రూపొందించిన మెసేజ్‌లు, ఫైల్స్ లేదా లింకుల ద్వారా మాల్ వేర్ అటాక్స్ జరిగే రిస్క్ ఉందని తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు వాడేందుకు మీ ఫోన్‌లోని కీలక సమాచారం తస్కరిస్తారు. వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడం, కొన్ని సెక్యూరిటీ పరిమితులను దాటడం వంటి రిస్క్ పెరుగుతాయి.

వాట్సాప్ యూజర్లు ఏం చేయాలి? :

  • భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రిస్క్ తగ్గించుకోవచ్చు.
  • వెంటనే వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచే అప్‌డేట్స్ పొందాలి.
  • గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులు, ఫైల్స్ ఓపెన్ చేయొద్దు
    కంప్యూటర్‌లో వాట్సాప్ వాడేవారు డెస్క్‌టాప్ వెర్షన్‌ను కూడా అప్‌డేట్ చేయాలి.
    వాట్సాప్‌ను నిర్లక్ష్యంగా వాడకుండా, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి