Motorola Edge 70 Pro Plus : మోటోరోలా లవర్స్‌కు పండగే.. రూ.47,999 ఫోన్ ఇప్పుడు జస్ట్ రూ. 42,749కే.. ఇంకా తగ్గాలంటే?
Motorola Edge 70 Pro Plus : మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,250 వరకు తగ్గింపు అందిస్తోంది. 50MP ట్రిపుల్ కెమెరా, 6500mAh బ్యాటరీ, అమోల్డ్ డిస్‌ప్లే ఫీచర్లు, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ధర వివరాలివే..
- Sreehari A
- Published on- November 21, 2026 / 07:45 PM IST
Motorola Edge 70 Pro Plus
- కెమెరా ప్రియులకు గుడ్ న్యూస్..
- మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌పై అదిరిపోయే డిస్కౌంట్
- తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లు..
Motorola Edge 70 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నవారికి మోటరోలా అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ముఖ్యంగా మంచి కెమెరా, భారీ బ్యాటరీ, ప్రీమియం డిస్‌ప్లే ఉన్న ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.5,250 వరకు తగ్గింపు లభిస్తోంది. మరి ఈ ఆఫర్ ఏంటి? ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓసారి వివరంగా చూద్దాం..
ఇప్పుడు రూ.42,749కే :
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.47,999గా ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ద్వారా ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. రూ.5,250 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ మోటోరోలా ఫోన్ ధర రూ.42,749కు చేరుతుంది. అయితే, ఈ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్లతో మాత్రమే వస్తుంది.
అదిరిపోయే డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ :
ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల సూపర్ హెచ్‌డీ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కూడా ఉంది. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం చేయొచ్చు. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియులకు ప్రత్యేకం :
కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ మూడు 50MP కెమెరాలు ఉన్నాయి. సోనీ లైటియా 710 ప్రైమరీ కెమెరాతో పాటు 3.5x ఆప్టికల్ జూమ్ పెరిస్కోప్ కెమెరా, అల్ట్రావైడ్ మాక్రో కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
అంతేకాదు, IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉన్నాయి. మోటో ఏఐ 2.0 ఫీచర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తంగా చూస్తే మంచి కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే కోరుకునే వారికి ఈ ఫోన్‌పై డిస్కౌంట్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ కొనే చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లేటెస్ట్ ధర, ఆఫర్లు చెక్ చేసుకోండి..
