Apple Kukatpally Store : హైదరాబాద్‌లో ఆపిల్ సందడి.. డిసెంబర్ 10న ఫస్ట్ స్టోర్ ప్రారంభం.. ప్రత్యేకతలివే..!
Apple Kukatpally Store :హైదరాబాద్‌లో ఆపిల్ తొలి అధికారిక స్టోర్ డిసెంబర్ 10న కూకట్‌పల్లిలో ప్రారంభం కానుంది. లొకేషన్, స్టోర్ ప్రత్యేకతలు, అందుబాటులో ఉండే సేవలు, ప్రొడక్టుల వివరాలివే..
- Sreehari A
- Published on- November 26, 2026 / 01:48 PM IST
Apple Kukatpally Store to Open in Hyderabad
- హైదరాబాద్‌లో ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్..
- సిటీ ఆఫ్ పెర్ల్స్‌లో ఆపిల్ సందడి.. తొలి స్టోర్ ఎక్కడంటే?
- డిసెంబర్ 10 నుంచి హైదరాబాద్‌లో ఆపిల్ హంగామా..
Apple Kukatpally Store : హైదరాబాద్‌లోని ఆపిల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పటివరకు ఆన్లైన్లోనో, ఇతర నగరాల్లోని స్టోర్లలోనో ఆపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నవారికి ఇకపై నగరంలోనే ప్రత్యేక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ హైదరాబాద్‌లో తన తొలి అధికారిక స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ఈ స్టోర్ కస్టమర్ల కోసం తెరుచుకోనుంది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న లేక్ షోర్-వై జంక్షన్ మాల్లో ఈ కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. భారత్‌లో ఆపిల్‌కు ఏడో అధికారిక రిటైల్ స్టోర్ కావడం విశేషం. స్టోర్ ప్రారంభానికి ముందే కంపెనీ ప్రత్యేక బ్యారికేడ్ డిజైన్‌ను కూడా ప్రవేశపెట్టింది.
హైదరాబాద్‌కు ఉన్న ‘సిటీ ఆఫ్ పెర్ల్స్’ గుర్తింపును ప్రతిబింబించేలా ముత్యాన్ని పోలిన ఆపిల్ లోగోను ఇరిడిసెంట్ రంగులతో రూపొందించింది. నగర సంస్కృతి, వారసత్వానికి ఈ డిజైన్ ప్రత్యేక గుర్తుగా నిలవనుంది.
స్టోర్‌లో ఏం ఉండబోతున్నాయి? :
ఈ స్టోర్‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు కంపెనీకి చెందిన లేటెస్ట్ ప్రొడక్టులను కస్టమర్లు నేరుగా చూసి కొనుగోలు చేయొచ్చు. ఆపిల్ స్పెషలిస్టుల నుంచి ప్రొడక్టులకు సంబంధించి పూర్తి వివరాలు, టెక్నికల్ హెల్ప్ కూడా పొందవచ్చు.
Read Also : 121 Kgs Gold Ornaments : తిరుమల శ్రీవారికి 121 కోట్లు ఇచ్చిన భక్తుడు ఎవరు? ఆయన ఫుల్ డిటెయిల్స్ ఇవే..
అంతేకాదు.. ఫొటోగ్రఫీ, వీడియో క్రియేషన్, డ్రాయింగ్ వంటి అంశాలపై ఉచితంగా నిర్వహించే ‘టుడే ఎట్ ఆపిల్’ సెషన్లలోనూ పాల్గొనవచ్చు. వ్యాపార అవసరాల కోసం స్పెషల్ అసిస్టెన్స్ అందించే టీమ్ కూడా అందుబాటులో ఉంటుంది.
స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కస్టమర్ల కోసం ప్రత్యేక వాల్పేపర్లను కూడా ఆపిల్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ స్ఫూర్తితో ప్రత్యేక ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను రూపొందించింది.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ, రిటైల్ కస్టమర్ కేర్ టీమ్‌లతో ఆపిల్‌కు ఈ కొత్త స్టోర్ మరో కీలక అడుగుగా నిలవనుంది. దీంతో భారత్‌లో ఆపిల్ రిటైల్ నెట్వర్క్ మరింత విస్తరించనుంది.
