IND VS NZ 1st Test : న్యూజిలాండ్‌పై పంత్ విధ్వంసం.. సిక్సర్ల రికార్డు బద్దలు.. టెస్టుల్లో చారిత్రాత్మక ఘనత సొంతం!

Rishabh Pant : మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్ (136) సెంచరీతో మెరవగా.. శుభ్‌మన్ గిల్ (98), దేవదత్ పడిక్కల్ (80) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

Rishabh Pant

IND VS NZ 1st Test Rishabh Pant : న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. దీంతో మూడు రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఈ క్రమంలో కివీస్ జట్టుపై తొలి ఇన్నింగ్స్ లో 118 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదిలాఉంటే.. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.

Also Read : IND vs NZ 1st Test : అయ్యో గిల్.. ఇలా చేశావేంటి? మూడోరోజు ముగిసిన ఆట.. పట్టు బిగిస్తున్న టీమిండియా..

మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్ (136) సెంచరీతో మెరవగా.. శుభ్‌మన్ గిల్ (98), దేవదత్ పడిక్కల్ (80) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచిన పంత్ తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా జాకబ్ డఫీ వేసిన ఓవర్లో వరుసగా సిక్స్, సిక్స్, ఫోర్ కొట్టి భారత స్కోరు వేగాన్ని పెంచాడు. 55 బంతుల్లోనే తన 22వ టెస్ట్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు. సేనా (SENA) దేశాల్లో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) టెస్ట్ క్రికెట్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన పంత్.. తన మొత్తం టెస్ట్‌ సిక్సర్ల సంఖ్యను 104కు పెంచుకున్నాడు.

సేనా దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆసియా ఆటగాళ్లు..
రిషబ్ పంత్ 50 సిక్సులతో తొలి స్థానంలో నిలవగా.. సచిన్ టెండూల్కర్ 23 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. కపిల్ దేవ్ 21 సిక్సులు, రోహిత్ శర్మ 18, రవీంద్ర జడేజా 18, ఎంఎస్ ధోనీ 17, మహమ్మద్ యూసుఫ్ 17, యూనిస్ ఖాన్ 17 సిక్సుర్లు కొట్టారు.