MS Dhoni Net Worth : క్రికెట్లోనే కాదు.. సంపాదనలోనూ కింగ్! ధోనీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
MS Dhoni Net Worth : మహేంద్ర సింగ్ ధోనీ.. ఆర్థికంగానూ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఐపీఎల్ పారితోషికం, బీసీసీఐ నుంచి వచ్చిన ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడులు.. ఇలా పలు మార్గాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు.
MS Dhoni Net Worth
MS Dhoni Net Worth : టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మైదానంలో తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. ఆర్థికంగానూ భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఐపీఎల్ పారితోషికం, బీసీసీఐ నుంచి వచ్చిన ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపార పెట్టుబడులు.. ఇలా పలు మార్గాల్లో కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంతకీ ధోనీ మొత్తం ఆస్తి విలువ ఎంత? ఐపీఎల్లో ఇప్పటివరకు ఎంత సంపాదించాడు? అనే విషయాలను కొన్ని నివేదికల ఆధారంగా ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : MS Dhoni IPL Retirement : ఎంఎస్ ధోనీ బిగ్ డెసీషన్.. ఐపీఎల్‌కు గుడ్‌బై.. ఇక నుంచి కొత్త బాధ్యతలు..
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ ఈ లీగ్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తొలి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి రూ.6 కోట్ల పారితోషికం చెల్లించింది. ఆ తర్వాత అతడి క్రేజ్, ప్రదర్శనకు అనుగుణంగా వేతనం పెరుగుతూ వచ్చింది. 2011 నుంచి 2013 వరకు ఏడాదికి రూ.8.28 కోట్లు అందుకున్న ధోనీ.. 2014, 2015 సీజన్లలో రూ.12.5 కోట్ల పారితోషికం పొందాడు. 2016, 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున కూడా ఇదే మొత్తాన్ని అందుకున్నాడు. 2018 నుంచి 2021 వరకు చెన్నై జట్టు అతడికి ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించింది. 2022 నుంచి 2024 వరకు రూ.12కోట్ల చొప్పున అందుకున్న ధోనీ.. 2025, 2026 సీజన్లలో రూ.4 కోట్లు అందుకున్నాడు.
ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 2004 నుంచి 2020 వరకు కొనసాగింది. ఈ సమయంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజుల రూపంలో భారీ మొత్తాన్ని అందుకున్నాడు. అతడి కెరీర్లో అత్యుత్తమ సమయంలో గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ.5 కోట్ల పారితోషికం అందుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు రూ.3 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజులు అందేవి. మొత్తం అంతర్జాతీయ కెరీర్లో బీసీసీఐ నుంచి రూ.50 కోట్లకు పైగా సంపాదించినట్లు అంచనా.
ధోనీ మొత్తం ఆస్తుల విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పలు ఆర్థిక నివేదికలు అంచనా. క్రికెట్ ఆదాయంతో పాటు ప్రకటనలు, వ్యాపారాలు, పెట్టుబడులు అతడి సంపద పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ధోనీ దాదాపు 50 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. అతడి క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రముఖ కంపెనీలు పోటీపడుతుంటాయి. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా ఏడాదికి సుమారు రూ.3.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు అంచనా. అంతేకాదు.. క్రికెట్‌తో పాటు పలు వ్యాపార రంగాల్లోనూ ధోనీ పెట్టుబడులు పెట్టాడు. రాంచీలో సుమారు 43 ఎకరాల వ్యవసాయ క్షేత్రం కూడా ధోనీకి ఉంది. అక్కడ సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సాగు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
సోషల్ మీడియాలో పెద్దగా చురుగ్గా ఉండకపోయినా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక్కో స్పాన్సర్డ్ పోస్టు ద్వారా సుమారు రూ.1.5 కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే.. మైదానంలో తన ఆటతో రికార్డులు సృష్టించిన ధోనీ, మైదానం వెలుపలా తెలివైన పెట్టుబడులతో సంపదను పెంచుకుంటున్నాడు. అందుకే భారత క్రికెట్లో అత్యంత సంపన్న ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.
