IPL 2027 Retention : ఐపీఎల్ 2027.. ప్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్లు వీరే.. స్టార్ ఆటగాళ్లకు షాక్!
IPL 2027 Retention : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2027కు సంబంధించి ఆయా ప్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్ల జాబితా విడుదలైంది.
- Harish Thanniru
- Updated on- November 17, 2026 / 08:19 PM IST
IPL 2027 Retention
IPL 2027 Retention : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2027కు సంబంధించి ఆయా ప్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్ల జాబితా విడుదలైంది. ఈసారి పలు జట్లు కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, మతీషా పతిరణ వంటి స్టార్ ఆటగాళ్లు విడుదలయ్యారు. దీంతో డిసెంబర్ 16న జరగనున్న మినీ వేలంపై ఆసక్తి పెరిగింది.
ఫ్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్లు..
♦ ముంబై ఇండియన్స్ (MI) : ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కేశవ్ మహరాజ్, మయాంక్ మార్ఖండే, మయాంక్ రావత్, మొహమ్మద్ ఇజార్, దానిష్ మాలేవార్, అథర్వ అంకోలేకర్
♦ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) : ఎంఎస్ ధోనీ, ప్రశాంత్ వీర్, మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీ, జాక్ ఫాల్క్స్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ మధ్వాల్, డయాన్ ఫారెస్టర్, మెక్నీల్ నోరోన్హా
♦ కోల్కతా నైట్రైడర్స్ (KKR) : అజింక్య రహానే, మతీషా పతిరణ, రచిన్ రవీంద్ర, ముస్తాఫిజుర్ రెహమాన్, ఆకాశ్ దీప్, నవదీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, బ్లెస్సింగ్ ముజారాబాని ఇతర ఆటగాళ్లు
♦ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) : మిచెల్ స్టార్క్, నితీశ్ రాణా, అభిషేక్ పోరెల్, పాథుమ్ నిస్సాంక, బెన్ డకెట్, కరుణ్ నాయర్, దుష్మంత చమీరా, రెహాన్ అహ్మద్, అజయ్ మండల్
♦ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) : ట్రావిస్ హెడ్, కామిందు మెండిస్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మదుశంక, శివమ్ మావి, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ పేన్, ఇతర ఆటగాళ్లు
♦ గుజరాత్ టైటాన్స్ (GT) : ఇషాంత్ శర్మ, మార్క్ వుడ్, కుల్వంత్ ఖేజ్రోలియా, షారుఖ్ ఖాన్, కానర్ ఎస్టెర్హజెన్
♦ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) : జాకబ్ బెథెల్, రిచర్డ్ గ్లీసన్, మంగేశ్ యాదవ్, సాత్విక్ దేశ్వాల్, విహాన్ మల్హోత్రా.
♦ రాజస్థాన్ రాయల్స్ (RR) : ఆడమ్ మిల్నే, క్వెనా మఫాకా, తుషార్ దేశ్పాండే, కుల్దీప్ సేన్, యుద్ధవీర్ సింగ్, విఘ్నేశ్ పుత్తూర్, రవి సింగ్, షిమ్రాన్ హెట్మైర్
♦ పంజాబ్ కింగ్స్ (PBKS) : లాకీ ఫెర్గూసన్, మిచ్ ఓవెన్, నేహల్ వధేరా, పాయల్ అవినాశ్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్
♦ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) : మాథ్యూ పాల్ బ్రీట్జ్కే, అవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జే, జార్జ్ లిండే, వనిందు హసరంగ, నామన్ తివారీ, అర్షిన్ కులకర్ణి
