IPL 2027 : ట్రేడింగ్‌లు, రిటైన్‌లు తరువాత ఏ ప్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు ఉందంటే? అత్యధికంగా ఈ జట్టు వద్దే..!

IPL 2027 : రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక మినీ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీల వద్ద ఎంత డబ్బు ఉంది..? మిగిలిన స్లాట్లు ఎన్ని? వాటిలో విదేశీ ఆటగాళ్లను ఏ జట్టు ఎంతమందిని కొనుగోలు చేయగలదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకున్నాం.

IPL 2027

IPL 2027 : క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2027 కు సంబంధించి ఆయా ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల జాబితా విడుదలైంది. ఈసారి పలు జట్లు కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, మతీషా పతిరణ వంటి స్టార్ ఆటగాళ్లు విడుదలయ్యారు.

Also Read : IPL 2027 Retention : ఐపీఎల్ 2027.. ప్రాంచైజీలు వదులుకున్న ప్లేయర్లు వీరే.. స్టార్ ఆటగాళ్లకు షాక్!

తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన జరిగే ఐపీఎల్ మినీ వేలంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కీలక ఆటగాళ్లను ఏ జట్టు కొనుగోలు చేస్తుంది.. ఎంత మొత్తం చెల్లిస్తుంది అనేది క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు.. రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక మినీ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీల వద్ద ఎంత డబ్బు ఉంది..? మిగిలిన స్లాట్లు ఎన్ని? వాటిలో విదేశీ ఆటగాళ్లను ఏ జట్టు ఎంతమందిని కొనుగోలు చేయగలదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకున్నాం.

ట్రేండింగ్‌లు, రిటైన్‌లు పూర్తయ్యాక ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత ఉందంటే?
♦ ఎల్‌ఎస్‌జీ రూ. 47.45 కోట్లు, కేకేఆర్‌ రూ.41.65 కోట్లు, ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 40.15 కోట్లు, డీసీ రూ. 39.5 కోట్లు, ముంబయి రూ. 32.6 కోట్లు, సీఎస్‌కే రూ. 28.05 కోట్లు, ఆర్‌ఆర్‌ రూ. 27.05 కోట్లు, పంజాబ్‌ రూ.18.6 కోట్లు, ఆర్సీబీ రూ.14.5 కోట్లు, గుజరాత్‌ రూ. 8.75 కోట్లు.

ఫ్రాంచైజీల వారీగా మిగిలి ఉన్న స్లాట్లు (మొత్తం/ఓవర్సీస్‌)..
♦ ఎల్‌ఎస్‌జీ : 7/3, కేకేఆర్‌ 8/3, ఎస్‌ఆర్‌హెచ్‌ 7/3, డీసీ 9/4, ముంబయి 9/2, సీఎస్‌కే 6/2, ఆర్‌ఆర్‌ 6/3, పంజాబ్‌ 6/2, ఆర్సీబీ 5/1, గుజరాత్‌ 3/2.

రిటెన్షన్ ప్రక్రియకు ముందే ఆటగాళ్ల బదిలీలు ఇవే..
♦ హార్దిక్ పాండ్యా – ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు (రూ.18 కోట్లు)
♦ అర్ష్‌దీప్ సింగ్ – పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు (రూ.18 కోట్లు)
♦ రిషభ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు (రూ.15 కోట్లు)
♦ కుల్దీప్ యాదవ్ – ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నోకు (రూ.13.25 కోట్లు)
♦ మహమ్మద్ షమీ – లక్నో నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు (రూ.8 కోట్లు)
♦ లియామ్ లివింగ్‌స్టోన్ – హైదరాబాద్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు (రూ.6 కోట్లు)
♦ హర్షల్ పటేల్ – హైదరాబాద్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు (రూ.4 కోట్లు)
♦ సామ్ కరన్ – రాజస్థాన్ నుంచి లక్నోకు (రూ.2.4 కోట్లు)