IND vs NZ 1st Test : కివీస్‌తో తొలి టెస్టు.. సెంచరీతో చెలరేగి చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సచిన్, కోహ్లీ సరసన..
IND vs NZ 1st : ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేయడంతో అరుదైన ఘనత సాధించాడు. తన టెస్టు కెరీర్లో అతడికిది 13వ సెంచరీ.
- Harish Thanniru
- Published on- November 21, 2026 / 07:36 AM IST
IND vs NZ 1st Test
IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా మూడోరోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే సమయంలో అరుదైన ఘనత సాధించాడు.
Also Read : AsiaCup Rising Stars 2026 : బంతులతో నిప్పులు చెరిగిన భారత్ బౌలర్లు.. ప్రత్యర్థి జట్టు 26 పరుగులకే ఆలౌట్..
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 368 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండోరోజు (శుక్రవారం) ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రీజులో కేఎల్ రాహుల్, పడిక్కల్ ఉన్నారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేశారు. మూడో రోజు (శనివారం) ఆటలోనూ వారిద్దరూ న్యూజిలాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 84 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. పడిక్కల్ 80 పరుగుల వద్ద ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (110 నాటౌట్), శుభ్‌మన్ గిల్ క్రీజులో కొనసాగుతున్నారు.
ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేయడంతో అరుదైన ఘనత సాధించాడు. తన టెస్టు కెరీర్లో అతడికిది 13వ శతకం. భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన నాల్గో బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ (12) నిలిచాడు. సునీల్ గవాస్కర్ (33) అగ్రస్థానంలో ఉండగా.. వీరేంద్ర సెహ్వాగ్ (22), మురళీ విజయ్ (12) తర్వాత ఉన్నారు.
మరో వైపు.. సేనా దేశాల (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) పై సెంచరీ చేసిన ఎనిమిదో ఆసియా బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రాహుల్ కాకుండా.. మహమ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండుల్కర్, సయీద్ అన్వర్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, కుమార సంగక్కర, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో కేఎల్ రాహుల్, సయీద్ అన్వర్ ఓపెనర్లుగా వచ్చి సెంచరీ చేయడం గమనార్హం. భారత ఆటగాళ్ల జాబితా విషయానికి వస్తే.. రాహుల్ ఐదో స్థానంలో నిలిచాడు.
