IND vs NZ 1st Test : పంత్, ధ్రువ్ జురెల్ సూపర్ బ్యాటింగ్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్..

IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో భాగంగా.. తొలి ఇన్నింగ్స్ ను భారత్ జట్టు 720/9 వద్ద డిక్లేర్ చేసింది.

IND vs NZ 1st Test: India Declare at 720/9, Take a 352-Run First-Innings Lead

IND vs NZ 1st Test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్యం వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 486 పరుగులతో నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడు ప్రదర్శించింది. ఈ క్రమంలో రిషభ్ పంత్‌ (128; 153 బంతుల్లో-10 ఫోర్లు-6 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ శతకం నమోదు చేశాడు. ధ్రువ్ జురెల్ (78) రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. జురెల్ ఔట్ అయిన తరువాత 720/9 వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. దీంతో భారత్ ఆధిక్యం 352 పరుగులకు చేరింది.

Also Read : IND vs NZ 1st Test : 45ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత వికెట్ కీపర్

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 368 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీమిండియా బ్యాటర్లు అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ (136) సెంచరీ చేయగా.. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (98) రెండు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వీ జైస్వాల్ (85), దేవ్‌దత్ పడిక్కల్ (80) రాణించారు. నాల్గో రోజు ఆటలో రిషబ్ పంత్ (128) సెంచరీతో అదరగొట్టాడు.. ధ్రువ్ జురెల్ (78) అర్ధ సెంచరీతో రాణించాడు. జురెల్ ఔట్ అయిన తరువాత 720/9 టీమిండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఇదిలాఉంటే.. తొలి టెస్టులో భాగంగా మూడు రోజుల ఆటలో భారత జట్టు పైచేయి సాధించగా.. నాలుగో రోజు ఆటలోనూ భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం కొనసాగించారు. మరోరోజు మ్యాచ్ మిగిలి ఉండటంతో టీమిండియా బౌలర్ల విజృంభిస్తే గెలుపు సునాయాసం అవుంతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ గడ్డపై ఓ టెస్టు ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2019లో బంగ్లాదేశ్ 715/6 స్కోర్ చేసింది. ఇక ఇదే వేదికపై వెస్టిండీస్ 2016లో 660/5 చేసిన స్కోర్ నూ టీమిండియా అధిగమించింది.