IND A vs UAE : కీల‌క మ్యాచ్‌లో టాస్ ఓడిన భార‌త్.. యూఏఈ బ్యాటింగ్‌..తుది జ‌ట్టులో కీల‌క మార్పులు..

IND A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహా వేదిక‌గా భార‌త్-ఏ, యూఏఈ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

Asia Cup Rising Stars 2026 United Arab Emirates opt to bat 3 changes in Ind A

IND A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహా వేదిక‌గా భార‌త్-ఏ, యూఏఈ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత ఫీల్డింగ్ చేయ‌నుంది.

సెమీస్ చేరుకోవాలంటే యూఏఈ పై భార‌త్‌-ఏ జ‌ట్టు త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సి ఉంది. ఈ క్ర‌మంలో భార తుది జ‌ట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయుష్ బదోని, విప్రజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్‌ల స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దుబే, అర్షద్ ఖాన్‌ల‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

Ind A vs UAE : భార‌త్‌కు చావోరేవో.. యూఏఈతో కీల‌క మ్యాచ్ నేడే.. ఎక్క‌డ చూడొచ్చంటే?

భార‌త్‌-ఏ తుది జ‌ట్టు ఇదే..
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ (కెప్టెన్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీప‌ర్‌), రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే, హర్షిత్ రాణా, అర్షద్ ఖాన్