Sobhita Dhulipala : లిప్ కిస్‌తో భర్తకి బర్త్ డే విషెస్ చెప్పిన శోభిత.. లవర్ అంటూ పోస్ట్..

నాగచైతన్య - శోభిత లిప్ కిస్ ఫోటో వైరల్ గా మారింది. (Sobhita Dhulipala)

  • Published on- November 23, 2026 / 11:01 AM IST

Sobhita Dhulipala

Sobhita Dhulipala : టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య – శోభిత మరోసారి వైరల్ అవుతున్నారు. వీరి పెళ్లి తర్వాత ఎవరి పుట్టిన రోజు వచ్చినా ఇంకొకరు స్పెషల్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. నేడు నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్పెషల్ పోస్ట్ చేసింది.

వెకేషన్ లో నాగచైతన్యకు లిప్ కిస్ ఇచ్చిన ఫోటోతో పాటు ఇద్దరూ క్లోజ్ గా దిగిన మరో ఫోటోని షేర్ చేసి హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో నాగచైతన్య – శోభిత లిప్ కిస్ ఫోటో వైరల్ గా మారింది. శోభిత పెట్టిన పోస్ట్ ని అభిమానులు షేర్ చేస్తూ చైతూకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక నాగచైతన్య త్వరలోనే డిసెంబర్ 4న వృషకర్మ సినిమాతో రాబోతున్నారు. శోభిత తమిళ్ లో త్వరలో వెట్టువం అనే సినిమాతో రానుంది.