Siddu Gadi Love Story : సిద్ధుగాడి లవ్ స్టోరీ రిలీజ్ డేట్ అనౌన్స్.. అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్ చేసిన దర్శకుడు..

మనోజ్ హీరోగా, శృతి, మోహన సిద్ధి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో. (Siddu Gadi Love Story)

  • Published on- November 24, 2026 / 04:10 PM IST

Siddu Gadi Love Story

Siddu Gadi Love Story : అమెరికాలో జాబ్ చేస్తూ సినిమా పై ఆసక్తి ఉన్న రమేష్ బాబు చెరుకూరు ఇండియాకు వచ్చి సిద్ధుగాడి లవ్ స్టోరీ అనే సినిమాని డైరెక్ట్ చేసారు. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బాల బ్రహ్మచారి, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో సావిత్రమ్మ చెరుకూరు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా మనోజ్ హీరోగా, శృతి, మోహన సిద్ధి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో.

సుమన్, సర్కార్, జబర్దస్త్ అప్పారావు, చిత్రం శ్రీను.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సిద్ధుగాడి లవ్ స్టోరీ సినిమా నవంబర్ 27 రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ దర్శకుడు రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు.

Also See : Mohan Babu : 51 ఏళ్ళ నట ప్రస్థానం.. మోహన్ బాబు స్పెషల్ సెలబ్రేషన్స్..

దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా తెలుగు సినిమా మీద ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మనసులో ఉన్న సినిమా కలను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ప్రేక్షకుల ఆదరణ, ఆశీస్సులతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఒక మంచి లవ్ స్టోరీలా సిద్ధుగాడి లవ్ స్టోరీ తెరకెక్కించాను అని తెలిపారు.