Prabhudeva : షాకింగ్ కాంబో.. ప్రభుదేవా డైరెక్షన్‌లో మంచి విష్ణు సినిమా అనౌన్స్..

నేడు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుదేవా తన నెక్స్ట్ సినిమాని మంచు విష్ణుతో ప్రకటించాడు. (Prabhudeva)

  • Published on- November 23, 2026 / 11:20 AM IST

Prabhudeva

Prabhudeva : స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా డైరెక్టర్ గా కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్ గానే కాక హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ ఊహించని సినిమా ప్రకటించారు.

నేడు మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుదేవా తన నెక్స్ట్ సినిమాని మంచు విష్ణుతో ప్రకటించాడు. ప్రభుదేవా డైరెక్షన్ లో విష్ణు మంచు 24వ సినిమా VM24 అని ప్రకటించారు. విష్ణుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ విషయాన్ని తెలిపారు ప్రభుదేవా.

Also Read : Sobhita Dhulipala : లిప్ కిస్‌తో భర్తకి బర్త్ డే విషెస్ చెప్పిన శోభిత.. లవర్ అంటూ పోస్ట్..

విష్ణుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి .. హ్యాపీ బర్త్ డే టు మై హీరో, లిటిల్ బ్రదర్ విష్ణు మంచు. ఈ సెలబ్రేషన్ ని మరింత స్పెషల్ గా, కలర్ ఫుల్ గా VM24 సినిమాతో మారుద్దాం అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ సరికొత్త కాంబినేషన్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుదేవా ఇటీవలే విష్ణు కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.