Pawan Kalyan : ధనుష్ ‘ఓం’ సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్.. పవన్ ఎర్రచందనం ఆపరేషన్ పై..
పవన్ చేసిన మంచిని పక్క స్టేట్ వాళ్ళు కూడా గుర్తించి ఇలా చూపించారు అని అభినందిస్తున్నారు. (Pawan Kalyan)
- Saketh U
- Published on- November 21, 2026 / 12:14 PM IST
Pawan Kalyan
Pawan Kalyan : ధనుష్ హీరోగా ఓం సినిమా నిన్నే రిలీజయింది.ఈ సినిమా 2014 ,15 సమయంలో శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్, కూలీలు, స్మగ్లింగ్ చేసేవాళ్లను పట్టుకోవడం.. కథాంశంతో తెరకెక్కింది. రియల్ గా జరిగిన సంఘటనలు తీసుకోవడంతో అప్పటి రాజకీయ నాయకులు, ఆఫీసర్స్ పాత్రలను కూడా సినిమాలో చూపించారు. సినిమాలో సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండటం గమనార్హం.
ఈ సినిమా అంతా ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టాలి, అలా చేసేవాళ్లను పట్టుకోవాలి అనే నేపథ్యంలో సాగుతుంది. అయితే సినిమా అంతా అయ్యాక చివర్లో ఎండ్ టైటిల్స్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, దానిపై చేసిన ఆపరేషన్స్ కి సంబంధించిన పలు పేపర్ క్లిప్స్ చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ ఎర్రచందనంపై చేసిన ఆపరేషన్ కగర్ గురించి ఉన్న పేపర్ క్లిప్ కూడా చూపించారు. ఆ పేపర్ క్లిప్ లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. పవన్ చేసిన మంచిని పక్క స్టేట్ వాళ్ళు కూడా గుర్తించి ఇలా చూపించారు అని అభినందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అటవీశాఖ బాద్యతలు తీసుకున్న తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి ఆపరేషన్ కగర్ అని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న చాలా ఎర్రచందనంను పట్టుకున్న సంగతి తెలిసిందే. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
