Mokshagna Debut Movie : బాలయ్య కొడుకు ఫస్ట్ సినిమాలో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పండగే?
Mokshagna Debut Movie : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 28, 2026 / 06:07 PM IST
Mokshagna Debut movie jr ntr special role vassishta
Mokshagna Debut Movie : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఆయన సినిమా ఉందంటూ వార్తలు వస్తున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. తాజాగా మోక్షజ్ఞ తొలి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై బాలకృష్ణతో దర్శకుడు వశిష్ట చర్చించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Arjun Sarja : అయోధ్యలో యాక్షన్ కింగ్ కొత్త సినిమా.. ‘ఆపరేషన్ సిందూర్’ కథతో.. ఫోటోలు..
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగమైతే.. నందమూరి అభిమానులకు ఇది నిజంగానే ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా నిలవనుంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చేయనున్నారు. అలాగే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
