Krishna Burugula : పరిగెత్తి పది సినిమాలు చేయను.. కమెడియన్ జిగ్రీస్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్..
మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కృష్ణ. (Krishna Burugula)
- Saketh U
- Published on- November 28, 2026 / 01:42 PM IST
Krishna Burugula
Krishna Burugula : ATM సిరీస్ తో నటుడిగా పేరు తెచ్చుకొని ‘జిగ్రీస్’ సినిమాతో కమెడియన్ గా ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు కృష్ణ బూరుగుల. ఆ సినిమాతో బెస్ట్ కమెడియన్ గా గద్దర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు కృష్ణ. జిగ్రీస్ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న కృష్ణకు బోలెడన్ని సినిమా ఆఫర్స్ వచ్చాయి. అయితే పరిగెత్తి అలా వరుస సినిమాలు చేయను అంటూ నేడు తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు కృష్ణ.
కృష్ణ తేజ బూరుగుల మాట్లాడుతూ.. జిగ్రీస్ సినిమాకు ముందు రెండు మూడు సినిమాల్లో నటించినా జిగ్రీస్ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ సక్సెస్ వచ్చింది కదా అని కంగారుపడి దొరికిన ప్రతి సినిమాకు సైన్ చేయడం లేదు. పరిగెత్తి పది రొటీన్ సినిమాలు చేసి కనుమరుగయ్యే కంటే నిలబడి నాలుగు సినిమాలు చేసినా కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలని ఫిక్స్ అయ్యాను. కేవలం కథకు, నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటాను అని తెలిపాడు.
Also Read : Patas Praveen : జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ కూతురు బారసాల ఫంక్షన్.. ఫొటోలు..
తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఒక యూనిక్ స్టోరీ పాయింట్‌తో, కడుపుబ్బా నవ్వించే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌తో త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రానుంది. దాంతో పాటు మరి కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. సరైన కథ వస్తే మరోసారి నా నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాను అని తెలిపారు.
