RC 17 : ‘RC17’ రిలీజ్ ప్లాన్ ఇదేనా?
RC 17 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 28, 2026 / 09:45 PM IST
Is This Ram Charan RC 17 release plan
RC 17 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కథ, స్క్రిప్ట్‌తో పాటు నటీనటుల ఎంపిక, ఇతర కీలక టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ పనులను పూర్తి చేసే పనిలో మూవీ యూనిట్ బిజీగా ఉందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 మార్చి నుంచి RC17 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే విడుదల తేదీ విషయంలో కూడా చిత్ర బృందం ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.2028 మే నెలలో సినిమాను వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో థియేటరికల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Gnaneswari Kandregula : పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల స్టైలిష్ ఫోటోలు..
సుకుమార్ తనదైన మేకింగ్ స్టైల్‌తో రామ్‌చరణ్‌ను సరికొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నారట. షూటింగ్‌కు తగినంత సమయం కేటాయించి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా..సరికొత్తగా RC17ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా వర్క్ నడుస్తోందట.
అయితే 2028 మే విడుదల తేదీపై సుక్కు అండ్ టీమ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా..సోషల్ మీడియాలో మాత్రం రిలీజ్ డేట్‌పై చర్చ మొదలైంది. RC17 2028 మే నెలలో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మరి.
