Allu Arjun-Boyapati : పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ-బోయపాటి ప్రాజెక్ట్?

Allu Arjun-Boyapati : దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Is Allu Arjun Next Movie with Boyapati

Allu Arjun-Boyapati : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతోందా.? మాస్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు టాక్.

ఇప్పటికే బోయపాటి శ్రీను స్టోరీ కాన్సెప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించాడట. కథలోని కొత్తదనం, భారీ స్థాయి నేపథ్యం నచ్చడంతో బన్నీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంతో మాస్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా, ఓ రేంజ్‌ విజువలైజేషన్‌, పవర్ ఫుల్ రోల్స్‌, అద్భుతమైన సీన్లతో ఈ కథను రూపొందించాలని బోయపాటి భావిస్తున్నారట. అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో చూపించేలా పాత్రను డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Anshu Selvamani : ఇట‌లీలో రోజా కూతురు.. అన్షు ఫోటోలు వైర‌ల్..

బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎలివేషన్లు, పవర్‌ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలాంటి దర్శకుడికి అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్ తోడైతే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ముఖ్యంగా పుష్ప సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీని బోయపాటి ఏ స్థాయిలో ప్రజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిన తర్వాత నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంబో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో పౌరాణిక కథతో సినిమా రూపొందితే ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతి అందించే అవకాశం ఉంది.