Tollywood producers : టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ సెగ..!
Tollywood producers : టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ సెగ గట్టిగానే తాకుతోందట.
Gossip Garrage CBFC New Rules Tension to Tollywood producers
Tollywood producers : టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ సెగ గట్టిగానే తాకుతోందట. సెన్సార్ బోర్డు అబ్జక్షన్స్ చేస్తుండటంతో నిర్మాతలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయడానికే భయపడిపోతున్నారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుండగా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూడాల్సి వస్తుందట.
సినిమా షూటింగ్ ఒకవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరోవైపు చేస్తూ ఎలాగోలా రిలీజ్ డేట్‌కు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంటున్న నిర్మాతలకు CBFC కొత్త నిబంధనలు ఇప్పుడు తలనొప్పిగా మారాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సెన్సార్ కోసం సినిమా విడుదలకు కనీసం 15 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే, నవంబర్, డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల నిర్మాతలకు టైమ్ మేనేజ్మెంట్ సవాలుగా మారుతుందట. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగించే సినిమాలకు ఈ నిబంధన మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు మేకర్స్.
Payal Radhakrishna : కోటీ దీపోత్సవంలో నటి పాయల్ రాధాకృష్ణ.. ఫోటోలు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వారం విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, అందరికీ సరిపోయే స్థాయిలో సెన్సార్ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ సెన్సార్ పనులను వేగవంతం చేసే విధానం కొనసాగుతోందట.
ఇప్పుడు 15 రోజుల ముందు అప్లై చేసుకోవాలన్న నిబంధన పాటించాల్సి వస్తే సినిమా రిలీజ్ డేట్లను ఖరారు చేసుకోవడం కష్టంగా మారే పరిస్థితి ఉంటున్నారట కొందరు నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్‌తో సతమతమవుతున్న మేకర్స్‌కు ఈ కొత్త నిబంధనలు అదనపు భారంగా మారతాయా.? లేక సెన్సార్ వ్యవస్థలోనూ మరిన్ని మార్పులు వస్తాయా.? అన్నది ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికర చర్చగా మారింది.
