Garudavega Anji : బాలీవుడ్ లో సినిమా డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్..
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. (Garudavega Anji)
- Saketh U
- Published on- November 20, 2026 / 05:32 PM IST
Garudavega Anji
Garudavega Anji : టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకుడిగా బాలీవుడ్ లో సినిమా తెరకెక్కిస్తున్నాడు. పృథ్వీ రాజ్, తంబి రామయ్య, సంజయ్ సింగ్, గంజా కరుప్పు, ప్రశాంత్ నారాయణన్, ఎస్తేర్ అనిల్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్’ . యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పణలో ప్యారేలాల్ గుండెచా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల వంటి అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని మహిళా భద్రత, పోలీసు దర్యాప్తు నేపథ్యంలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ సినిమా అనౌన్స్ చేస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్ర పోషించడం గొప్ప అనుభవం. మహిళల భద్రతకు సంబంధించిన సంఘటనలు కేవలం వార్తల్లోకి రావడం కాదు మనందరి సామూహిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇలాంటి సమస్యలను ప్రజల చర్చలోకి తీసుకురావడంలో సినిమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని అన్నారు. ప్రశాంత్ నారాయణన్ మాట్లాడుతూ.. నిజ జీవితంలోని పలు సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథలతో ఈ సినిమా తీస్తున్నాము. ఈ సినిమాలోని ఆసక్తికరమైన కథాంశం, గొప్ప సందేశం నన్ను ఆకర్షించాయి అని అన్నారు.
Also Read : Mayookha : ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. బిగ్ బాస్ అమన్ కీలక పాత్రలో నటించిన సినిమా చూశారా?
నిర్మాత ప్యారేలాల్ గుండేచా మాట్లాడుతూ.. సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురాగల శక్తి సినిమాకు ఉందని నేను నమ్ముతాను. అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్ సినిమాతో మహిళల భద్రత, న్యాయం, బాధ్యతాయుతమైన పోలీసింగ్ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నాం అని తెలిపారు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి మాట్లాడుతూ.. ఈ సినిమా సంప్రదాయ క్రైమ్-థ్రిల్లర్ కథనానికి అతీతంగా ఉంటుంది. ఈ సినిమాలో మహిళల భద్రత, ప్రజా బాధ్యత, జీవితాలను మార్చగల పరిస్థితులను చర్చిస్తున్నాం. ఈ సినిమాకు దర్శకుడిగానే కాక సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేస్తున్నాను అని తెలిపారు.
ఈ ‘అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్’ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గర్వాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి.. ఇలా తొమ్మిది భాషల్లో రిలీజ్ కాబోతుందని, 2027లో థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు మూవీ యూనిట్.
