ENE Repeat Collections : అదరగొట్టిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే..?
తాజాగా రెండు రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. (ENE Repeat Collections)
- Saketh U
- Published on- November 21, 2026 / 11:44 AM IST
ENE Repeat Collections
ENE Repeat Collections : ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ENE రిపీట్ అంటూ నవంబర్ 19న రిలీజయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి పార్ట్ కి మించి కామెడీ, ఫ్రెండ్షిప్, సినిమా ఎమోషన్ ని ఇందులో పండించారు. దానికి తోడు సినిమాలో చాలా మంది స్టార్ దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు గెస్ట్ రోల్స్ చేసి నవ్వించారు. దీంతో ఈ సినిమా ఊహించినట్టుగానే యూత్ కి బాగా కనెక్ట్ అయింది.
ENE రిపీట్ సినిమా మొదటి రోజే 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రెండు రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ENE రిపీట్ సినిమా రెండు రోజుల్లో ఏకంగా 23.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 40 కోట్ల గ్రాస్ వసూలు అవ్వాలి. నేడు, రేపు వీకెండ్ కాబట్టి ఇంకో 17 కోట్లు ఈజీగా వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఇక అమెరికాలో కూడా ENE రిపీట్ సినిమా 1 మిలియన్ చేరువలో ఉంది.
ఈ నగరానికి ఏమైంది పార్ట్ 1తో పోలిస్తే ఈ సినిమాకు దాదాపు 10 రేట్ల బిజినెస్ జరిగింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలు అలాంటివి. మూవీ టీమ్ ఆ అంచనాలను తమ కంటెంట్ తో అందుకుంది. ఈ సినిమాతో ఫ్లాప్స్ లో ఉన్న తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ హిట్ కొట్టారు. అభినవ్ గోమఠంకి మరింత స్టార్ డమ్ వచ్చింది.
