Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. భయపడ్డ వర్షిణి.. బిగ్ బాస్ 10 డే 75 ఫుల్ ఎపిసోడ్..

ఇప్పటివరకు జరిగిన చాలెంజెస్ లో ఎక్కువ త్రిగున్ టీమ్ గెలుచుకున్నారు. (Bigg Boss New Captain)

  • Published on- November 20, 2026 / 10:47 PM IST

Bigg Boss New Captain

Bigg Boss New Captain : నిన్నటి ప్రశ్నలు, వెయిట్ గేమ్ కంటిన్యూ అయింది. రామ్ ప్రసాద్ చివర్లో వెయిట్ ఎక్కువ అయి వదిలేసాడు. అమన్ ఎక్కువ సేపు ఉంచాడు. అయితే ముకేశ్ ఎక్కువ బరువు మోసినందుకు ముకేశ్ తన టీమ్ విన్నర్ అన్నాడు. వంశీ త్రిగున్ టీమ్ చెప్పాడు. అందరూ ముకేశ్ చెప్పిన దానికి ఆశ్చర్యపోయారు. సుధీర్ వచ్చి అడిగాడు కూడా ఇది కరెక్ట్ కాదు అని ముకేశ్ వెయిట్ చెయ్ అన్నాడు. దాంతో బిగ్ బాస్ మాట్లాడి ఎక్కువ సేపు హోల్డ్ చేసి, ఎక్కువ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు విన్నర్స్ అన్నారు. అయినా రామ్ ప్రసాద్ వైపే నిలబడటంతో మళ్ళీ బిగ్ బాస్ అడిగాడు. దీంతో త్రిగున్ టీమ్ గెలిచింది అని ప్రకటించాడు.

దాంతో బిగ్ బాస్ త్రిగున్ ని పక్క టీమ్ లో ఒకర్ని పోటీ లోంచి తప్పించామన్నాడు. దాంతో త్రిగున్ రామ్ ప్రసాద్ ని తప్పించాడు. ఇది గేమ్ అని ఇంకా అర్థంకాక వర్షిణి.. తను ఎదగడం కోసం ఎవర్నైనా తొక్కుతాడు అని త్రిగున్ గురించి ముకేశ్ తో మాట్లాడింది. డిక్టేటర్ త్రిగున్ కటౌట్ కిచెన్ లో పెట్టమన్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ ఫుడ్ పంపించాడు.. బిర్యానీ గెలిచిన టీమ్ కి, డిక్టేటర్స్ కి, గంజి, పొటాటో ఓడిపోయిన టీమ్ కోసం.. కుకింగ్ ఓడిపోయిన టీమ్.. కేవలం గెలిచిన వాళ్ళ కోసం వండాలి. ఓడిపోయిన టీమ్ కి ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తాడు అని రూల్స్ పెట్టారు.

ముకేశ్ తన టీమ్ తో ఫుడ్ గురించి మాట్లాడాడు. గేమ్ విన్నింగ్ గురించి రామ ప్రసాద్ తో వంశీ, దేబ్జానీ మాట్లాడాడు. ముకేశ్ కరెక్ట్ కాదు అని సుధీర్, రామ్ ప్రసాద్ మాట్లాడుకొని సుధీర్ మీ టీమ్ లో ఉండను అని ముకేశ్ కి చెప్పి వెళ్ళిపోయాడు. రామ్ ప్రసాద్ ముకేశ్ టీమ్ అయినా ముకేశ్ వర్షిణి కి మాత్రమే సపోర్ట్ చేస్తుండటంతో బిగ్ బాస్ తో రామ్ ప్రసాద్ మాట్లాడాడు. త్రిగున్.. తన టీమ్ అందరికి ఫుడ్ డివైడ్ చేసాడు. నరేష్ గంజి తింటుంటే ఏడ్చేశాడు రామ్ ప్రసాద్. గంజి పంపించినందుకు బిగ్ బాస్ మీద కోపం వచ్చింది అన్నాడు. త్రిగుణ, వంశీ, దేబ్జానీ.. రామ ప్రసాద్ ని ఓదార్చారు. దీంతో నరేష్ కూడా వచ్చి ఓదార్చాడు. త్రిగున్ తన టీమ్ తో పాటు రామ్ ప్రసాద్, నరేష్ కి కూడా పిలిచి ఫుడ్ పెట్టాడు. తనే దగ్గరుండి తినిపించాడు.

Also See : Saanve Megghana : ఫ్రెండ్ పెళ్ళిలో సందడి చేసిన హీరోయిన్.. తళతళ మెరిసిపోతూ..

త్రిగుణ ఓడిపోయిన టీమ్ క్లీనింగ్ చేయాల్సిందే అని, రెండు రోజుల నుంచి చేయట్లేదు అని చెప్పినా ముకేశ్ టీమ్ ఒప్పుకోలేదు. దాంతో అందరూ డిస్కషన్స్ పెట్టారు. ముకేశ్ టీమ్ అంతా వెళ్లి ముకేశ్ తో ఏం చేయాలి అని డిస్కషన్స్ చేసారు. వాళ్ళు చేయమని చెప్పేసారు. ఓడిపోయిన ముకేశ్ టీమ్ కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తే త్రిగున్ టీమ్ ఆ ఫుడ్ లాక్కొని వాళ్లకు వండిన తర్వాతే వాళ్ళని తినమన్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ అయింది. ముకేశ్ కిచెన్ లో రాకూడదు అయినా రావడంతో త్రిగున్, ముకేశ్ గొడవ పడ్డారు.

ఇప్పటివరకు జరిగిన చాలెంజెస్ లో ఎక్కువ త్రిగున్ టీమ్ గెలుచుకున్నారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కి త్రిగుణ టీమ్ వాళ్ళే పోటీ పడతారు అని చెప్పాడు బిగ్ బాస్. ముకేశ్ టీమ్ ఎక్కువ ఛాలెంజ్ లు గెలవలేదు కానీ వాళ్ళ టీమ్ లో ముగ్గురు ఒక ఛాలెంజ్ లో పోటీ చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ పోటీలకు స్థానం గెలుచుకుంటారు అని చెప్పారు బిగ్ బాస్. ఆ ముగ్గురు ఎవరు అనేది వాళ్ళ టీమ్ నే డిస్కస్ చేసుకోమన్నాడు.

నీతూ.. ముకేశ్ ని నేను పోటీ చేస్తాను అని అడిగితే మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయడానికి త్రిగున్ టీమ్ మీకు చేసిన అన్యాయాలు వాళ్లనే వచ్చి చెప్పమన్నాడు. వాళ్ళు చెప్తే ఛాన్స్ ఇస్తా అన్నాడు. దాంతో నీతూ అడిగితే త్రిగున్ ఓకే అన్నాడు. కానీ ముకేశ్ త్రిగున్, అతని టీమ్ ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు, దేబ్జానీ గురించి కంపేర్ చేస్తూ అడిగి నీతూకి ఎలా ఇస్తాను అని రివర్స్ అయ్యాడు. దీంతో నీతూ ఫైర్ అయింది. త్రిగున్ కి నీతూకి సపోర్ట్ చేసినా ముకేశ్ మాత్రం నీతూకి సపోర్ట్ చేయకూడదు అన్నట్టే ఉన్నాడు. తర్వాత ముకేశ్ టీమ్ అంతా కూర్చొని కెప్టెన్ కంటెండర్ టాస్క్ కి ఎవర్ని పంపాలి అని చర్చలు జరిపారు. నరేష్ కూడా పోటీ చేస్తా అన్నాడు కానీ ముకేశ్ ఒప్పుకోలేదు.

Also See : Rashmika Mandanna : మైసా సాంగ్ లాంచ్ ఈవెంట్.. క్యూట్ గా నవ్వుతూ సందడి చేసిన రష్మిక.. ఫొటోలు..

చివరకు రామకృష్ణ, తను, నీతూ పోటీ చేస్తారని ఫిక్స్ అయి చెప్పాడు ముకేశ్. వాళ్లకు కంటెండర్ టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్ లో నీతూ గెలిచి కెప్టెన్సీ టాస్క్ కి పోటీ చేయడానికి గెలుచుకుంది. ముకేశ్ గేమ్ ఆడలేక ఓడిపోతే నేనే కావాలని ఓడిపోయాను అని కవరప్ చేస్తూ సుధీర్ దగ్గర నేను తోపు అన్నట్టు చెప్పుకొని కొంత ఓవర్ యాక్షన్ చేసాడు. దాంతో సుధీర్ నువ్వు ఓడిపోదాం అనుకున్నప్పుడు వేరే వాళ్లకు ఛాన్స్ ఇవొచ్చు కదా టీమ్ లో, వాళ్లకు ఉపయోగపడేది అనేసరికి ముకేశ్ మాట పడిపోయింది. దాంతో నాకు వాళ్ళ గురించి తెలుసు అని ఏదో కవర్ చేసాడు.

ఇక కెప్టెన్సీ టాక్స్ కి త్రిగున్ ని తన టీమ్ లో ముగ్గుర్ని మాత్రమే సెలెక్ట్ చేయమన్నాడు బిగ్ బాస్. దీంతో టీమ్ కి వాళ్ళ పాజిటివ్స్ గురించి చెప్పి ఎవరు ఆడతారు అనేది డైరెక్ట్ బిగ్ బాస్ కే చెప్తాను అన్నాడు త్రిగున్. వర్షిణి మైక్ పెట్టుకోకపోవడంతో బిగ్ బాస్ తిట్టాడు. రూమ్ లో పెట్టి కాసేపు తాళం వేసాడు. లోపల లైట్స్ కూడా తీసేయడంతో వర్షిణి భయమేస్తుందని ఏడ్చేసింది.

త్రిగున్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కి అమన్, శివ, దేబ్జానీలకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పాడు. దాంతో నీతూ, అమన్, శివ, దేబ్జానీలకు కెప్టెన్సీ పోరు పెట్టారు. ఒక గేమ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమన్ గెలిచి హౌస్ కి కొత్త కెప్టెన్ అయ్యాడు. శివ అమన్ తన గేమ్ ని చెడగొట్టాడు అని వాదించాడు. ఫైనల్ గా అమన్ కొత్త కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్సీ తో పాటు, ఈ వారం ఎలిమినేషన్ సేఫ్ అయితే డైరెక్ట్ 13వ వారం ఫైనల్ వీక్ కి వెళ్తారు అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో అమన్ మంచి ఛాన్స్ పొందినట్టే..