Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ భారీ షాక్.. లిబియా తీరంలో యుద్ధనౌకను పేల్చేశాం.. జెలెన్‌స్కీ వీడియో!
Russia Ukraine War : లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మెర్క్యురీని ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఏడు నేవీ డ్రోన్లతో రెండు నౌకలపై దాడి చేసిన వీడియోను విడుదల చేశారు.
- Sreehari A
- Published on- November 23, 2026 / 10:20 PM IST
Russia Ukraine War
- సముద్రంలో రష్యా నౌకలకు ముప్పు..
- ఏడు డ్రోన్లతో జెలెన్‌స్కీ మెరుపు దాడి
- లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక ఖతం..
Russia Ukraine War : యుద్ధం అంటే కేవలం భూమి మీదే కాదు.. సముద్రంలోనూ సాగుతుందని మరోసారి నిరూపించింది ఉక్రెయిన్.. రష్యాకు చెందిన యుద్ధనౌకను లిబియా తీరంలో ముంచేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. ఈ దాడికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది..
కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ ధ్వంసం :
జెలెన్‌స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ తయారు చేసిన 7 నేవీ డ్రోన్లతో రష్యాకు చెందిన 2 నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఒకటి చిన్నపాటి యుద్ధనౌక ‘మెర్క్యురీ’. 2023లో అందుబాటులోకి వచ్చిన ఈ నౌక రష్యా నౌకాదళానికి చెందిన ఆధునిక యుద్ధనౌకల్లో ఒకటిగా చెబుతున్నారు. ఈ దాడిలో కేఏ-27 యుద్ధ హెలికాప్టర్ కూడా ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
Read Also : Jio New Year Recharge Plans : జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూ.399కే అన్‌లిమిటెడ్ 4జీ, 5జీ డేటా!
ఇక మరోవైపు రష్యాకు చెందిన ‘ఎమ్‌వీ అంగారా’ సరకు రవాణా నౌకను కూడా ఉక్రెయిన్ డ్రోన్లు టార్గెట్ చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయుధాల రవాణాకు ఈ నౌకను ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో దాడి :
అసలు ఈ దాడి లిబియాలోని బెంగాజీ నౌకాశ్రయం సమీపంలో జరిగింది.. ఇంధనం, ఇతర అవసరాల కోసం మెర్క్యురీ యుద్ధనౌక అక్కడ ఉన్న సమయంలో ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
జెలెన్‌స్కీ అభినందనలు :
జెలెన్‌స్కీ విడుదల చేసిన వీడియోలో సముద్రంపై దూసుకొచ్చిన డ్రోన్లు నౌకలను ఢీకొట్టడం, ఆ వెంటనే భారీ పేలుళ్లు సంభవించడం, మంటలు ఎగసిపడటం కనిపిస్తున్నాయి. శత్రువులు నష్టాన్ని తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న తమ భద్రతా సంస్థల సిబ్బందిని జెలెన్‌స్కీ ప్రత్యేకంగా అభినందించారు.
