Rice Price Drop: సామాన్యులకు భారీ ఊరట.. భారీగా తగ్గిన బియ్యం ధరలు.. బీపీటీ, సోనా ధరలు ఎంత ఉన్నాయి తెలుసా?
ఎగుమతుల ఆంక్షలు, కొత్త పంట రాకతో బియ్యం ధరలు(Rice Price Drop) క్రమంగా తగ్గుముఖం పట్టాయి. బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ తక్కువ ధరలకే లభిస్తుండటంతో సామాన్యులకు ఊరట లభిస్తోంది.
- V Santhosh Kumar
- Published on- November 29, 2026 / 05:08 PM IST
With the arrival of the new harvest rice prices have dropped significantly.
Rice Price Drop: గత కొంతకాలంగా వినియోగదారుల నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేసిన బియ్యం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు దూసుకుపోయిన రేట్లు ప్రస్తుతం కాస్త దిగిరావడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తోంది. ఎల్నినో ప్రభావం, ప్రతికూల వాతావరణం, మిల్లింగ్ ఖర్చులు, సరఫరా లోపాలు, కృత్రిమ కొరత వంటి అంశాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి సన్న వడ్లకు డిమాండ్ పెరగడంతో గత నాలుగు నెలల్లో ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.50–55 ఉన్న రకాలు రూ.65–80 స్థాయికి చేరాయి. దీనికి తోడు కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు విధించడం, రాష్ట్ర ప్రభుత్వం నిల్వలపై నిఘా పెంచి ప్రభుత్వ నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయడం, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 5 వరకు 1,141 తనిఖీలు నిర్వహించి 35 క్రిమినల్ కేసులతో సహా 55 కేసులు నమోదు చేయడం వంటి చర్యలు ధరల నియంత్రణకు దోహదపడ్డాయి.
Harish Rao: కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా? హరీష్ రావు సంచలన కామెంట్స్
ఏ రకం బియ్యం ధర ఎంతంటే? తాజా రేట్ల వివరాలు:
ప్రభుత్వ తనిఖీలు, సరఫరా మెరుగుదల ప్రభావంతో మార్కెట్లో వివిధ రకాల బియ్యం ధరలు(Rice Price Drop) దిగివచ్చాయి. ప్రస్తుతం బీపీటీ, కేఎన్ఎం రకాలు కిలోకు రూ.66 వద్ద లభిస్తుండగా, తెలంగాణ సోనా, ఆర్ఎన్ఆర్ రకాలు కిలోకు రూ.74గా ఉన్నాయి. అలాగే హెచ్ఎంటీ, జెఎస్ఆర్ రకాలు కిలోకు రూ.79 ధర పలుకుతున్నాయి; రకం, నాణ్యత, బ్రాండ్, ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి.
కొత్త పంట రాకతో మరింత తగ్గే ఛాన్స్.. జాగ్రత్తలు అవసరం:
మార్కెట్లోకి కొత్త ధాన్యం రాక మొదలవ్వడంతో రానున్న రోజుల్లో బియ్యం సరఫరా పెరిగి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో అందుబాటులో ఉన్న స్థాయికి ధరలు రావాలని వినియోగదారులు కోరుతుండగా, ప్రభుత్వ పర్యవేక్షణ, కొత్త పంట సరఫరా ఇలాగే కొనసాగితే రేట్లు దిగివచ్చే వీలుంది; అయితే డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
