Redmi TV A55 2027 Launch : గేమింగ్, మూవీలకు ఫర్ఫెక్ట్.. రూ.22 వేలకే 55 అంగుళాల 4K టీవీ.. రెడ్మి కొత్త టీవీ అదుర్స్!
Redmi TV A55 2027 Launch : రెడ్మి టీవీ A55 2027 చైనాలో లాంచ్ అయింది. 55 అంగుళాల 4K డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, HyperOS 4, Wi-Fi 6 ఫీచర్లతో వచ్చిన ఈ టీవీ ధర, పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- November 29, 2026 / 03:08 PM IST
Redmi TV A55 2027 Launch
- 165Hz రిఫ్రెష్ రేట్, 4K డిస్ప్లే..
- రెడ్మి కొత్త స్మార్ట్ టీవీ ధర ఎంతో తెలుసా?
- రెడ్మి కొత్త లాంచ్‌తో టీవీ మార్కెట్లో సందడి
Redmi TV A55 2027 Launch : కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? తక్కువ ధరలోనే పెద్ద స్క్రీన్, మంచి పిక్చర్ క్వాలిటీ, అదిరిపోయే ఫీచర్లు కావాలనుకుంటున్నారా? అయితే, రెడ్మి తీసుకొచ్చిన కొత్త టీవీ గురించి తెలుసుకోవాల్సిందే.. ప్రముఖ టెక్ సంస్థ షియోమీ చైనాలో రెడ్మి టీవీ ఎ55 2027ను లాంచ్ చేసింది. 55 అంగుళాల 4K డిస్ప్లే, ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్ ఈ టీవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.. పూర్తి వివరాలివే..
ధర ఎంతంటే? :
చైనాలో ఈ టీవీ అసలు ధర 1,999 యువాన్లు (సుమారు రూ.27,900). అయితే, లాంచ్ ఆఫర్లో భాగంగా 1,599 యువాన్లకే (సుమారు రూ.22,300) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరలో 55 అంగుళాల 4K టీవీ రావడం విశేషమే..
ఫీచర్లు అదుర్స్ :
ఈ రెడ్మి టీవీలో 3840×2160 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 4K డిస్ప్లే ఇచ్చారు. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ద్వారా స్క్రీన్‌పై మూవెంట్స్ మరింత స్మూత్‌గా కనిపిస్తాయి. అలాగే, 4K 60Hz ఎంఈఎంసీ టెక్నాలజీ కూడా ఉంది. తక్కువ ఫ్రేమ్ రేట్ ఉన్న వీడియోలను మెరుగ్గా కనిపిస్తాయి.
ఈ టీవీ 5-కోర్ A55 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. దీనికి 1.5GB ర్యామ్, 32GB స్టోరేజ్ అందించారు. షావోమీ హైపర్OS 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు షాయో ఏఐ వాయిస్ అసిస్టెంట్ కూడా ఇందులో ఉంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
సౌండ్, కనెక్టివిటీ కూడా బాగానే :
ఆడియో కోసం రెండు 10W స్పీకర్లు, డ్యూయల్ బాస్ డక్ట్లు ఇచ్చారు. రెండు HDMI 2.0 పోర్టులు, రెండు USB-A 2.0 పోర్టులతో పాటు ఈథర్నెట్, AV, S/PDIF కనెక్షన్లు ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్, చిల్డ్రన్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందించారు.
ఈ టీవీ ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే లభిస్తోంది. భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై షావోమీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఇదే ధరకు భారత్‌లోకి వస్తే బడ్జెట్ టీవీ కొనాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు..
