Chennupati Kanthisri: విజయవాడ డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంతిశ్రీ.. హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు!

విజయవాడ డిప్యూటీ మేయర్‌గా టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ సతీమణి కాంతిశ్రీకి(Chennupati Kanthisri) కీలక భాద్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు.

Cm chandrababu fulfills promise chennupati kanthisri appointed as vijayawada deputy mayor

Chennupati Kanthisri: విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ సతీమణి కాంతిశ్రీకి(Chennupati Kanthisri) కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి కంటి చూపు కోల్పోయిన చెన్నుపాటి గాంధీ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం ఈ కీలక బాధ్యతలను అప్పగించారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 20 నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవే!

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న అధినేత:

గత ప్రభుత్వ పాలనలో వైసీపీ శ్రేణుల దాడిలో చెన్నుపాటి గాంధీ తన కన్ను కోల్పోయిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం, ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల సమీకరణాల్లో భాగంగా మేయర్ పదవిని మిత్రపక్షమైన జనసేనకు కేటాయించినప్పటికీ, డిప్యూటీ మేయర్ పీఠాన్ని కాంతిశ్రీకి ఇచ్చి గాంధీ కుటుంబానికి సముచిత స్థానం కల్పించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులతో పాటు విజయవాడ నగర ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.